ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీకు బోలు ఎముకల వ్యాధి ఉన్నట్టే..!

world osteoporosis day 2023: ప్రస్తుత కాలంలో చాలా మంది బోలు ఎముకల వ్యాధి తో బాధపడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి బారిన పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

world osteoporosis day 2023: symptoms of weak bones causes of low bone density rsl
osteoporosis

world osteoporosis day 2023: ప్రతి ఏడాది ప్రపంచ బోలు ఎముకల వ్యాధి దినోత్సవాన్ని అక్టోబర్ 20 న జరుపుకుంటారు. ఎముకల ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. మన ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. ఇలాంటి వాటిని అస్సలు లైట్ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశారు. దీనివల్లే ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారినపడుతున్నారు. ఈ సమస్యలలో బలహీనమైన ఎముకలు ఒకటి . మన శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇతర ఎముకల సమస్యలు వస్తాయి. ఎముకలు బలహీనంగా ఉంటే కీళ్లు, కండరాల్లో నొప్పి వస్తుంది. అలాగే నడవానికి, లేవడానికి, కూర్చోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంతేకాదు ఇది ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది. మరి మన ఎముకలు బలహీనపడితే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


నడుము కింది భాగంలో నొప్పి

మీకు నడుము కింది భాగంలో నొప్పి వస్తే అస్సలు ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది మీ ఎముకలు బలహీనపడటాన్ని సూచిస్తుంది. మీ శరీరంలో క్యాల్షియం, విటమిన్  డి వంటి ఎన్నో రకాల పోషకాలు లోపించడం వల్ల ఎముకలు బలహీనపడి నొప్పి వస్తుంది. బోలు ఎముకల వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలలో వెన్నునొప్పి ఒకటి.
 

ఎముకల పగుళ్లు

చిన్నపాటి గాయం అయిన తర్వాత చాలా మందికి ఎముకల పగుళ్లు వస్తాయి. ఇది బలహీనమైన ఎముకలకు సంకేతమంటున్నారు నిపుణులు. ఇది ఎముకలకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. మణికట్టు, వెన్నెముక, తుంటి పగుళ్లు త్వరగా సంభవిస్తాయి.
 

తరచూ కండరాల నొప్పి

మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో కొన్నిరకాల పోషకాలు పుష్కలంగా ఉండాలి. ఇలాంటి వాటిలో కాల్షియం, పొటాషియం, విటమిన్ -డి వంటివి ఉంటాయి. అయితే ఈ పోషకాలు లోపించడం వల్ల కండరాల తిమ్మిరి, నొప్పి సమస్యలు వస్తాయి. దీన్ని సకాలంలో చికిత్స చేయకపోతే మీ ఎముకలు ఎంతో బలహీనంగా మారతాయి. ఎముకలు బలంగా ఉండాలంటే మంచి పోషకాహారం తినాలి. 
 

world osteoporosis day

శరీరం వంగిపోవడం

ఎవరి ఎముకలైతే బలహీనంగా ఉంటాయో వారి వెన్నెముక చాలా తొందరగా వంగిపోతుంది. అంతేకాదు ఎప్పుడూ తప్పుడు భంగిమలో కూర్చున్నా కూడా శరీరం వంగిపోతుంది.

లేచి నిలబడటంలో ఇబ్బంది

మీకు తరచుగా నిలబడటంలో ఇబ్బంది ఉంటే కూడా మీ ఎముకలు బలహీనంగా ఉన్నట్టే లెక్క. అలాగే లేస్తుంటే కాళ్లలో నొప్పి కలడం కండరాలు, ఎముకల బలహీనతకు సంకేతమంటున్నారు నిపుణులు. 

Latest Videos

vuukle one pixel image
click me!