Health Tips: సులువుగా పొట్ట తగ్గాలంటే.. ఈ జ్యూస్ తాగాల్సిందే

Navya G | Published : Oct 19, 2023 11:58 AM
Google News Follow Us

Health Tips: పొట్ట తగ్గడం కోసం అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం అయితే బిజీ షెడ్యూల్ ఉన్నవారికి ఇలాంటి వ్యాయామాలు చేయటం కుదరదు. అయితే క్యారెట్ జ్యూస్ తాగడం వలన పొట్ట తగ్గుతుంది అంటున్నారు నిపుణులు అదెలాగో చూద్దాం.
 

16
Health Tips: సులువుగా పొట్ట తగ్గాలంటే.. ఈ జ్యూస్ తాగాల్సిందే

 ప్రతిరోజు మనం కూరగాయల్లో క్యారెట్ ని చూస్తూనే ఉంటాం. కొందరు పచ్చిగా కూడా వీటిని తింటూ ఉంటారు. వీటిలో ఎన్నో మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. క్యారెట్ లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం వృద్ధి చెంది రక్తహీనత పోగుడుతుంది.

26

carrot  క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తొలగిపోయి జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యతకు  ఆస్కారం ఉంటుంది.

36

అలాగే డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడేవారు పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ని కరిగించుకోవడం కోసం క్యారెట్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. క్యారెట్ లో విటమిన్ బి వన్, బి టు, బి సిక్స్ అధికంగా ఉంటాయి.

Related Articles

46

ప్రోటీన్లను, కొవ్వులను జీర్ణం అయ్యేలా చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే బిటమిన్ శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతుంది క్యాలరీలు వేగంగా ఖర్చు అవ్వటంతో కొవ్వు కరిగి బరువు బాగా తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది.
 

56

 క్యారెట్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత యాలకులు, పుదీనా వేసి మరొకసారి మిక్సీ చేసుకొని వచ్చిన నీటిని వడపోసుకోవాలి.

66

 రుచి కోసం కొంచెం తేనె కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ని రోజుకి ఒక గ్లాస్ చొప్పున టిఫిన్ చేసే సమయానికి ముందు తీసుకుంటే మంచిది. ఇందులో ఉండే ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్ లు రోగనిరోధక శక్తిని పెంపొందించి కొవ్వులని కరిగిస్తాయి. హైబీపీని కూడా అదుపులో ఉంచుతుంది.

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos