Health Tips: కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. జాగ్రత్త ఈ ప్రమాదాలు తరుముకు వస్తాయి!

Health Tips: చాలామందికి దాహం వేయగానే మంచినీళ్లు కన్నా ముందుగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తున్నారు అయితే అది ఆరోగ్యమే ఎంత పాడు చేస్తుందో వారికి అర్థం కావడం లేదు. కూల్ డ్రింక్ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
 

 ఒకప్పుడు ఇంటికి అతిధులు వస్తే చల్లని మంచినీరు లేదా చక్కని మజ్జిగ వారికి సేద తీరటానికి ఇచ్చేవాళ్ళం. కానీ నేడు ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే ఫ్రిజ్ తీసి కూల్ డ్రింక్ ఇస్తున్నాము. అందుకోసం ఇంట్లోనే స్టాక్ కూడా పెట్టుకుంటున్నారు.
 

అయితే ఇది దీర్ఘకాలంలో ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకువస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. తరచుగా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల మనకు తెలియకుండానే మన శరీరం పై దారుణమైన ప్రభావాన్ని చూపుతుంది. మధుమేహ వ్యాధి రావడానికి కూల్ డ్రింక్స్ అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
 


 ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి టైప్ టు డయాబెటిస్ వస్తుంది. కూల్ డ్రింక్స్ లో ఉండే ఫాస్పరస్  యాసిడ్ వల్ల ఎముకల్లో కాల్షియం  తగ్గిపోతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మనకు ఎముకలు తీవ్రంగా బలహీన పడిపోయి చిన్న చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి.
 

 కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో గుండె పనితీరు మందగిస్తుందని,హార్ట్ ఎటాక్ లేదా ఇతర సమస్యలను తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ, సమస్యలు జీర్ణశక్తి తగ్గిపోవటం  వంటి ప్రమాదాలు తరుముకుంటూ వస్తాయి.
 

ఇక గర్భిణీ స్త్రీలు కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. ఎందుకంటే గర్భస్రావం అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో క్యాన్సర్ బారిన పడటానికి కూడా కూల్ డ్రింక్స్ కారణం అవుతుంది.
 

 కూల్ డ్రింక్ ని ఇంట్లో ఉపయోగించే వాష్ బేసిన్ లలో పోసి చూడండి. కూల్ డ్రింక్ లో ఉండే యాసిడ్ వాటిని పూర్తిగా తినేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంది. అటువంటి కూల్ డ్రింక్ ని మనం తాగకుండా ఉండటమే మంచిది.

Latest Videos

click me!