నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ఈ రోజును ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ దినోత్సవం లక్ష్యం. కొబ్బరి ప్రయోజనాలను అర్థం తెలుసుకోవడానికి, దీనిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో కొబ్బరిని తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తాయి.
coconut
కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు
కొబ్బరిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ ఎ , విటమిన్ కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నుంచి ఉత్పత్తి చేయబడిన కొబ్బరి నూనె వైద్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి.
కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా మన జీవక్రియను కూడా బాగా పెంచుతుంది. ఇది కడుపులోని భాగాలలో పేరుకుపోయే అవకాశం ఉన్న కొవ్వులను శక్తిగా మారుస్తుంది.
కొబ్బరి రుచిగా మాత్రమే కాదు మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అన్నీ కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎలక్ట్రోలైట్లను ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ ఇతర రకాల పానీయాలతో పోల్చినా కొబ్బరి నీరు అందించేన్ని ఎలక్ట్రోలైట్లను ఏదీ అందించదని నిపుణులు చెబుతున్నారు.
Image: Freepik
మన చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహజ కొబ్బరి నూనెను మించిన మంచి పరిష్కారం లేదు. అవును దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అకాల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.
Image: Getty
ఇది మన ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కొబ్బరి నూనెను వంట నూనెగా కూడా ఉపయోగించొచ్చు. అలాగే కొబ్బరినీళ్లు తాగడం, కొబ్బరికాయలు తినడం ఇవన్నీ ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty
కొబ్బరిలో లారిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోకి శోషించబడినప్పుడు మోనోలౌరిన్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఈ పదార్థాలు శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
Coconut
కొబ్బరిలో ఉండే పోషకాలు ఎముకల అభివృద్ధికి అవసరమైన మాంగనీస్, కాల్షియంను గ్రహించే మీ శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి కొబ్బరి కొంతవరకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.