బ్రెయిన్ ట్యూమర్ గురించి వీటిని అస్సలు నమ్మకండి

Published : Jun 08, 2023, 03:42 PM IST

బ్రెయిన్ ట్యూమర్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. దీనివల్ల ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

PREV
18
బ్రెయిన్ ట్యూమర్ గురించి వీటిని అస్సలు నమ్మకండి

బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన పెంచడానికి, దీని చికిత్సలో పురోగతిని పెంచడానికి, వ్యాధితో సంబంధం ఉన్న భయాల్ని తొలగించడానికి ప్రతి సంవత్సరం జూన్ 8 న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మెదడు కణితులను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. కానీ మెదడు కణితుల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా.. బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో ఎలాంటి విషయాలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

28

అపోహ 1: బ్రెయిన్ ట్యూమర్ పెద్దలను మాత్రమే వస్తుంది

వాస్తవం: బ్రెయిన్ ట్యూమర్ కేవలం పెద్దలకే కాదు పిల్లలకు కూడా వస్తుంది. నిర్ధారణ అయిన మొత్తం మెదడు కణితి కేసులలో సుమారు 3.9 శాతం 0-14 సంవత్సరాల పిల్లలలో సంభవిస్తాయి. అన్ని వయస్సుల వారు మెదడు కణితి సంకేతాలు, లక్షణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. 
 

38

అపోహ 2: మొబైల్ ఫోన్లు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి

వాస్తవం: మొబైల్ ఫోన్లను వాడితే మెదడు కణితుల ప్రమాదం పెరుగుతుందనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ  రేడియేషన్ కు ఎక్కువ కాలం గురికావడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి సెల్ ఫోన్ వాడకం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

48

అపోహ 3: ప్రతి బ్రెయిన్ ట్యూమర్ రోగికి ఇలాంటి లక్షణాలే ఉంటాయి

వాస్తవం: బ్రెయిన్ ట్యూమర్ రోగులందరికీ ఒకే రకమైన సంకేతాలు, లక్షణాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. కానీ అది నిజం కాదు. కణితి పరిమాణం, సైట్, గ్రేడ్ ను బట్టి లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. అయితే, కొన్ని సాధారణ లక్షణాలు తలనొప్పి, వికారం, అలసట మొదలైనవి ఉన్నాయి.
 

58

brain tumor

అపోహ 4: మెదడు కణితి జన్యుపరమైనది

వాస్తవం: కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్  ఉంటే మిగతా వాళ్లకు కూడా బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ దీనికి సరైన ఆధారాలు లేవు. పర్యావరణ లేదా జీవనశైలి కారకాలే మెదడు కణితికి ప్రధాన కారణాలు. కానీ ఇది వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొన్నారు. అందుకే ఇలాంటి వారు మెదడు ఎంఆర్ఐ, బయాప్సీ, కొన్ని ఇతర ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలి. 
 

68

అపోహ 5: మెదడు కణితులు క్యాన్సర్

వాస్తవం: బ్రెయిన్ ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్ అని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. మెదడు కణితులలో మూడింట ఒక వంతు మాత్రమే క్యాన్సర్ బారిన పడుతున్నారు. సకాలంలో ఇది నిర్ధారణ అయితే మెదడు కణితులను సరైన చికిత్సతో నయం చేయొచ్చు. క్యాన్సర్ లేని మెదడు కణితులు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ.. ఇవి కూడా లక్షణాలను కలిగిస్తాయి 
 

78

అపోహ 6: మెదడు కణితులు ప్రాణాంతకం

వాస్తవం: మెదడు కణితులు తీవ్రంగా ఉంటాయి. కానీ అవన్నీ ప్రాణాంతకం కాదు. రోగ నిరూపణ కణితి రకం, స్థానం, పరిమాణం, వ్యక్తి మొత్తం ఆరోగ్యం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మెదడు కణితులు నెమ్మదిగా పెరుగుతాయి. వీటికి చికిత్స చేయొచ్చు. 

88

అపోహ 7: మెదడు కణితులు అంటువ్యాధి

వాస్తవం: మెదడు కణితులు అంటువ్యాధులు కావు. అవి ఏ రకమైన పరిచయం లేదా ముట్టుకోవడం వల్ల వ్యక్తి నుంచి వ్యక్తికి అస్సలు వ్యాప్తి చెందవు.
 

Read more Photos on
click me!

Recommended Stories