Winter: జలుబు దరిచేరకుండా ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..!

First Published Oct 30, 2021, 5:06 PM IST

సాధారణ జలుబు ప్రాణాంతకం కానప్పటికీ, ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తలనొప్పి , వికారం లాంటివి కలిగిస్తూ ఉంటాయి. నోస్ బ్లాక్ అవ్వడం లేదంటే.. ముక్కు కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. 

చలికాలం వచ్చేసింది. మొన్నటి వరకు ఎండ వేడి తట్టుకోలేక షార్ట్స్ వేసుకున్నవారంతా.. ఇప్పుడు  చలి తట్టుకోలేక.. పై నుంచి కింద వరకు మొత్తం కవర్ చేసేస్తున్నారు. ఎండాకాలం ఉదయాన్నే స్మూతీ తాగినవారందరూ.. ఇప్పుడు వేడి వేడిగా టీ ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే చలిగాలులు మొదలయ్యాయి.
 

ఈ చలికాలం  వచ్చిందంటే చాలు వద్దన్నా.. తుమ్ములు, జలుబు, దగ్గు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గినవెంటనే.. వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ లాంటి మనపై ఎటాక్ చేయడం మొదలుపెడతాయి. దీంతో వెంటనే జలుబు చేసేస్తోంది.   ఆ వచ్చినవి ఒక పట్టాన  తగ్గుతాయా అంటే అదీ లేదు. వారం, పది రోజులు పట్టిపీడిస్తాయి. మరి ఈ శీతాకాలంలో జలుబు రాకుండా ఉండేందుకు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.
 

సాధారణ జలుబు ప్రాణాంతకం కానప్పటికీ, ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తలనొప్పి , వికారం లాంటివి కలిగిస్తూ ఉంటాయి. నోస్ బ్లాక్ అవ్వడం లేదంటే.. ముక్కు కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాని వల్ల చిరాకుగా అనిపిస్తాయి. అందుకే ఆ జలుబు మనపై ఎటాక్ చేయకముందే.. దానిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం..

hand wash

సాధారణ పరిశుభ్రతను పాటించండి: ఇప్పుడు  కరోనావైరస్ సమయం కాబట్టి.. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం అవసరం.  అంటువ్యాధులను నివారించడానికి , సూక్ష్మక్రిములను కడగడానికి, మీ చేతులను వీలైనంత తరచుగా హ్యాండ్-వాష్‌తో శుభ్రం చేసుకోండి, ఎందుకంటే జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు స్పర్శ ద్వారా వ్యాపిస్తాయి.

బలమైన రోగనిరోధక వ్యవస్థను: ముఖ్యంగా వైరల్ సీజన్‌లో విటమిన్ బి కాంప్లెక్స్ , విటమిన్ సి వంటి సప్లిమెంట్‌లు తీసుకోవాలి. ఇవి జలుబు , ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తాయి.
 

immunity

సమతుల్య ఆహారానికి కట్టుబడి ఉండండి: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు - చాలా పండ్లు, కూరగాయలు, లీన్ మాంసం, డైరీ , పౌల్ట్రీ  ఆహారం తీసుకోవాలి. ఇవి జలుబు రాకుండా కాపాడతాయి.

తగినంత విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు: ఇటువంటి సాధారణ వ్యాధులను నివారించడానికి తగినంత నిద్ర,విశ్రాంతి ముఖ్యం. నిద్ర లేమి అనేది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు కారణమౌతాయి. దాని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. విశ్రాంతి చాలా అవసరం. 

sudden sweating

చెమటను చిందించాలి: వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం కలిసి ఉండేలా చూసు్ోవాలి. ప్రతిరోజూ వ్యాయామం, యోగా, వాకింగ్ లాంటివి చేసి.. శరీరంలో నుంచి చెమట బయటకు వచ్చేలా చేయాలి.


డి-స్ట్రెస్: అనేక అధ్యయనాలు  పరిశోధనల ప్రకారం ఒత్తిడి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో ముడిపడి ఉంది. అందువల్ల, ఆరోగ్యకరమైన వ్యవస్థను నిర్వహించడానికి ఒత్తిడిని తగ్గించడం అవసరం - ఇది సాధారణ జలుబు, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను ప్రోగా తన్నగలిగేంత బలంగా ఉంటుంది.

click me!