హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 30, 2021, 01:09 PM ISTUpdated : Oct 30, 2021, 01:21 PM IST

కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అయితే హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటి కాదు. కార్డియాక్ అరెస్ట్ వస్తే వెంటనే మరణం సంభవిస్తుంది. ఈ ఆర్టికల్ ద్వారా కార్డియాక్ అరెస్ట్ (Article) రావుటకు కారణాలు, లక్షణాలు దాని చికిత్స విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
18
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!

కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) వచ్చినప్పుడు ఒక్కసారిగా గుండెకు రక్త సరఫరా (Blood circulation) ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ అందదు. అప్పుడు మనిషి ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు. ఊపిరి ఆడక స్పృహ కోల్పోతాడు. సాధారణ మనిషికి నిమిషానికి గుండె వేగం 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది.

28

అయితే కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest)  అయిన వారికి నిమిషానికి చాలా సార్లు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దాంతో గుండె అలిసిపోయి ఒక్కసారిగా ఆగిపోతుంది. అప్పుడు గుండె హఠాత్తుగా ఆగిపోవడం జరుగుతుంది. దాంతో మరణం (Death) సంభవిస్తుంది. నిజానికి ఇది ఒక రకంగా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు.

38
heart attack

కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) వచ్చిన కొద్ది సమయంలోనే సరైన చికిత్స (Treatment) తీసుకోవాలి. ప్రస్తుత  కాలంలో చాలా మంది దీని బారినపడి చనిపోతున్నారు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు, ఎవరెవరు దీని బారినపడుతారో, చికిత్స ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం..

48

పుట్టుకతోనే గుండె సమస్యలు (Heart problems) ఉన్న పిల్లలకు ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కరోనరీ హార్ట్ డిసీజ్‌తో (Coronary heart disease) బాధపడే వారిలో ఈ సమస్య వస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారికి, గుండె పరిమాణం పెద్దగా ఉన్న వారికి గుండె అకస్మాత్తుగా ఆగిపోయే లక్షణాలు ఉంటాయి.
 

58

కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ధూమపానం (Smoking) చేయడం, ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి, అధిక రక్త పోటు, అధిక బరువు (Over weight), వంశపారంపర్య గుండె జబ్బులు, అధిక పని ఒత్తిడి కారణంగా 45 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు వస్తుంటుంది.
 

68

శరీరంలో పొటాషియం (Potassium), మెగ్నీషియం (Magnesium) స్థాయిలు తక్కువగా ఉండడం కూడా ఈ వ్యాధి సంభవించడానికి ముఖ్య కారణాలు.  కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే మన జీవనశైలిలో సరైన ఆహారంతో పాటు సరైన వ్యాయామం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం 
 

78

కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) కు ముందు కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తాయి. తరచుగా తలతిరుగుతుంది, అలసటగా అనిపించడం, వాంతి (Vomiting), గుండెల్లో దడ పుట్టడం, అధిక ఛాతి నొప్పి ఇబ్బంది పెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి దీంతో స్పృహ కోల్పోవడం ఈ వ్యాధి లక్షణాలు.
 

88

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణం నిలుపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (Electro cardiogram) అనే పరీక్ష చేసి, తక్షణమే చికిత్స అందించడంతో శరీరానికి రక్తం ప్రసరణ జరిగి కార్డియాక్‌ అరెస్ట్‌ (Cardiac arrest) నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.

click me!

Recommended Stories