మంకీ పాక్స్ కూడా కరోనా మహమ్మారిలా వ్యాపిస్తుందా..?

Published : May 24, 2022, 03:42 PM IST

ఇప్పుడిప్పుడే.. ఈ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. మంకీ పాక్స్ విజృంభించడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ మంకీ పాక్స్ కేసులు నమోదవ్వడం ప్రారంభమయ్యాయి

PREV
16
 మంకీ పాక్స్ కూడా కరోనా మహమ్మారిలా వ్యాపిస్తుందా..?
Monkeypox-10

వైరస్ అనే పేరు చెబితే చాలు అందరూ భయపడిపోతున్నారు. ఆ భయాన్ని కరోనా మహమ్మారి మనందరిలోనూ నింపింది. రెండున్నరేళ్ల పాటు.. కనీసం ప్రశాంతంగా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే కూడా భయపడేలా చేసింది. 

26
Monkeypox-04

ప్రపంచ వ్యాప్తంగా  ఈ కరోనా మహమ్మారి వ్యాపించి.. కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడిప్పుడే.. ఈ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. మంకీ పాక్స్ విజృంభించడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ మంకీ పాక్స్ కేసులు నమోదవ్వడం ప్రారంభమయ్యాయి. దీంతో.. ఇది కూడా మరో మహమ్మారి కాబోతుందా అని అందరూ భయపడుతున్నారు.
 

36
Monkeypox-05

అమెరికాలో సైతం మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.దీంతో.. ఈ మంకీ పాక్స్ కేసులు పెరగడం చాలా ఆందోళన కలిగిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అయితే.. ఈ మంకీ పాక్స్.. కరోనా మహమ్మారిలా మారి.. ప్రపంచమంతా వ్యాపించదని.. అమెరికా అగ్ర ఆరోగ్య నిపుణులు చెప్పడం గమనార్హం.

46
Monkeypox-01

యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ అప్పర్ చీసాపీక్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ క్వాలిటీ ఆఫీసర్ డాక్టర్ ఫహీమ్ యూనస్ మాట్లాడుతూ, మంకీపాక్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఇది కోవిడ్ లాంటి మహమ్మారిగా మారే ప్రమాదం చాలా తక్కువ అని ఆయన అన్నారు. మంకీపాక్స్ వైరస్ SARS-CoV-2 (COVID-19కి కారణమయ్యే వైరస్) లాంటిది కాదని ఆయన చెప్పారు.

56

ప్రపంచానికి మంకీపాక్స్ గురించి దశాబ్దాలుగా తెలుసు అని.. మశూచి కుటుంబానికి చెందిన వైరస్ అని ఆయన చెప్పారు.  మంకీపాక్స్ వైరస్ సాధారణంగా ప్రాణాంతకం కాదని చెప్పారు. కరోనావైరస్ కంటే తక్కువ అంటువ్యాధి అని డాక్టర్ ఫహీమ్ తెలిపారు.

66

కోవిడ్-19 మాదిరిగా కాకుండా, వ్యాధికి వ్యాక్సిన్ ఉందని అని ఆయన చెప్పారు. దీనికి టీకాలు అందుబాటులోనే ఉన్నాయని.. దీనిపై పోరడాటానికి కూడా సమయం ఉందని ఆయన అన్నారు. 

click me!

Recommended Stories