కోవిడ్ టీకా ఆహార నియమాలు : ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా??

First Published May 18, 2021, 12:48 PM IST

టీకా వేసుకోగానే సరిపోదు.. వేసుకునేముందు, వేసుకున్న తరువాత ఆహారపు అలవాట్లు, నిత్య జీవన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యాక్సిన్ విజయవంతమవుతుంది. 

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో చీకట్లో కాంతిపుంజంలా వ్యాక్సినేషన్ కనిపించింది. ప్రజల్లో బతుకు మీద ఆశను చిగురింపజేసింది. దేశవ్యాప్తంగా అనేకమంది టీకాల కోసం క్యూలు కడుతున్నారు.
undefined
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో చీకట్లో కాంతిపుంజంలా వ్యాక్సినేషన్ కనిపించింది. ప్రజల్లో బతుకు మీద ఆశను చిగురింపజేసింది. దేశవ్యాప్తంగా అనేకమంది టీకాల కోసం క్యూలు కడుతున్నారు.
undefined
అయితే టీకా వేసుకోగానే సరిపోదు.. వేసుకునేముందు, వేసుకున్న తరువాత ఆహారపు అలవాట్లు, నిత్య జీవన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యాక్సిన్ విజయవంతమవుతుంది.
undefined
ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ కు వెళ్లకూడదు. ఇది అధికారికంగా నిరూపితం కాకపోయినా.. ఖాళీ కడుపుతో టీకాలు వేసుకున్నవారిలో చాలా సందర్భాల్లో వీక్ నెస్, యాంగ్జైటీకి దారితీసిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
undefined
మహారాష్ట్రలో కొన్ని కేసుల్లో ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకుని ఆ తరువాత ఆహారం తీసుకున్న వారిలో అసిడిటీ, తలనొప్పి, అనీజీ నెస్ కనిపించాయి.
undefined
కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లేముందు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిని వెళ్లడం మంచిదని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
undefined
ప్రముఖ పోషకాహార నిపుణుడు పూజా మఖిజా ఏం చెబుతున్నారంటే.. వ్యాక్సిన్ వేసుకునేముందు, తరువాత ఎక్కువగా ద్రవపదార్థాలు.. అంటే నీళ్లు, తాజా పళ్ల రసాలు తీసుకునేలా చూసుకోమంటున్నారు.
undefined
వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తేలికపాటి జ్వరం వస్తే డాక్టర్ ను సంప్రదించి.. వారి సలహా, సూచనలు ఫాలో కావాలని తెలిపారు. టీకా వేసుకోగానే ఏదైనా అసౌకర్యం కలుగుతుందా అనే విషయం గమనించడానికి.. వ్యాక్సిన్ వేయించుకున్న 30 ని.ల పాటు వ్యాక్సినేషన్ సెంటర్లోనే ఉండమని చెబుతున్నారు.
undefined
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీకా తీసుకున్న తర్వాత 72 గంటల పాటు సిగరెట్, మద్యానికి దూరంగా ఉండండి.
undefined
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీకా తీసుకున్న తర్వాత 72 గంటల పాటు సిగరెట్, మద్యానికి దూరంగా ఉండండి.
undefined
కెఫిన్ ఉండే పానీయాలూ అవైడ్ చేయండి అని చెబుతున్నారు.
undefined
ప్రీ-వ్యాక్సినేషన్.. వ్యాక్సిన్ కి ముందు తినే ఆహారం పోషకాలతో కూడి ఉండాలి. బయటి ఫుడ్ కాకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే తీసుకోండి.
undefined
అందులో ఎక్కువగా పసుపు, వెల్లుల్లి, అల్లం, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు ఉండేలా చూసుకోండి.
undefined
వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తినాల్సిన ఆహారపదార్థాలు... పొటాషియం పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్ తినాలి. దీనివల్ల శరీరంలో సిరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే, మీ ఆహారంలో సూప్ లేదా బ్రాత్ ఉండేలా చూసుకోండి.
undefined
వీటిల్లో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యాక్సిన్ తరువాత మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
undefined
వ్యాక్సిన్ తరువాత ఆహారంలో కొబ్బరి నీరు, బ్రౌన్ రైస్, అరటిపండు, పుచ్చకాయ, బంగాళాదుంపలను చేర్చాలి.
undefined
వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చీజ్ వంటకాలు, క్రీమ్ సాస్, వేపుళ్లు, రెడ్ మీట్, చక్కెర ఆహారాలు, ఎరేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు.
undefined
click me!