Health Tips: పొట్ట పదిలంగా ఉంటే.. ఆరోగ్యం పదిలంగా ఉన్నట్టే!

First Published | Sep 2, 2023, 6:29 PM IST

Health Tips: మన ఆరోగ్య వ్యవస్థ మన పొట్ట మీద ఆధారపడి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆరోగ్యకరమైన పొట్టతోనే బలమైన రోగనిరోధక వ్యవస్థ సాధ్యపడుతుంది కాబట్టి పొట్టని పదిలంగా ఉంచుకోవడం ఎలాగో ఇక్కడ చూద్దాం.
 

 మన పొట్ట ఆరోగ్యంగా ఉంటే శరీరం, గుండె, మెదడు అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే పొట్టలో ఏది పడితే అది తోసేయకుండా జీర్ణవ్యవస్థ క్షేమంగా ఉండేలాగా చూసుకోవాలి. అందుకు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి.
 

ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహార  పదార్థాలని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. వీటివల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. పాలకూర, బీట్రూట్, క్యారెట్, స్వీట్ పొటాటో మొదలైనవి పొట్టకి మంచి చేసే  ఫైబర్ గనులు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
 

Latest Videos


 కాబట్టి ఆహారంలో వీటిని తరచుగా వాడుతూ ఉండండి. అలాగే పొట్టకి తగినంత నీరు కూడా చాలా అవసరం. వ్యాయామం మిగతా శరీరంతో పాటు పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పని వ్యాయామం పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంచుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

 అలాగే అతిగా మద్యం తాగటం శరీరానికి మాత్రమే కాదు పొట్టలోని సూక్ష్మజీవులకు కూడా చెడు చేస్తుంది. మద్యం మోతాదు మించితే గుండెలో మంట, అసౌకర్యంగా ఉండడం, అల్సర్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. కాబట్టి మద్యం విషయంలో తగినన్ని జాగ్రత్తలు పాటించండి.
 

అలాగే ఏదైనా తిన్న తర్వాత అల్లం టీ తాగటం అనేది మంచి అలవాటు. ఎందుకంటే ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేలాగా చేస్తుంది. అలాగే పొట్ట ఆరోగ్యం మీద ఒత్తిడి ప్రభావం కూడా  ఎక్కువగానే ఉంటుంది. పరిపూర్ణమైన ఆరోగ్యము మెదడు,పొట్ట అనుసంధానం మీద ఆధారపడి ఉంటుంది.

అందుకే పొట్టని రెండో మెదడు అంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడిని దరిచేరనీయకుండా చూడండి. అలాగే మలద్వారం నుంచి రక్తం పడటం, రక్తహీనత అసాధారణంగా బరువు తగ్గటం వంటివి పొట్ట అనారోగ్యానికి సంకేతాలు. కాబట్టి వీటి విషయంలో అశ్రద్ధ చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

click me!