ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఐదేండ్లుగా భారతదేశంలో కూడా గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతోంది. పేలవమైన జీవనశైలి, అలవాట్ల మార్పులతో ప్రపంచవ్యాప్తంగా కార్డియాక్ అరెస్ట్, గుండె సమస్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటును వృద్ధులకు మాత్రమే వ్యాధిగా భావించేవారు. కానీ ఇప్పుడు 30-40 ఏండ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరూ గుండెపోటుతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం వీటిలో ఉన్నాయి.