బాగా అలసిపోయినా.. రాత్రిపూట ఎందుకు నిద్రపట్టదు?

First Published | Sep 20, 2024, 3:01 PM IST

చాలా మంది పొద్దంతా పనిచేస్తారు. కానీ నిద్రపోవడానికి మాత్రం చాలా తిప్పలు పడతారు. నిద్రకోసం బెడ్ పై అటు ఇటూ దొర్లుతూ ఏ సగం రాత్రికో లేకపోతే ఉదయం నాలుగైదు గంటలకు నిద్రలోకి జారుకుంటుంటారు. అసలు రాత్రిపూట ఎందుకు నిద్రపట్టదో తెలుసా? 
 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా కంటినిండా నిద్రపోవాలి. మన ఆరోగ్యానికి ఫుడ్ ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యం. అందుకే  రోజూ రాత్రిపూట 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెప్తారు. 

కానీ మనలో చాలా మందికి రాత్రిపూట అస్సలు నిద్రపట్టదు. పొద్దంత పనిచేసినా కూడా రాత్రిపూట నిద్రపట్టడం లేదని కొందరు వాపోతుంటారు. నిజానికి ఇలా నిద్రపట్టకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


Image: Getty

కెఫిన్

కొంతమంది టీ, కాఫీలను ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మారుస్తుంది. నిద్రమబ్బును వదిలిస్తుంది.

అందుకే సాయంత్రం 6 గంటల తర్వాత టీ, కాఫీల జోలికి వెళ్లకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తారు. సాయంత్రం వేళ టీ, కాఫీలను తాగితే మీ నిద్రకు అంతరాయం కలుగుతుంది. మీరు రాత్రిపూట అస్సలు నిద్రపట్టదు. 

ఉష్ణోగ్రత, వాతావరణం

మనం బాగా నిద్రపోవాలంటే.. ఆ ప్లేస్ ఎంతో కంఫర్ట్ గా ఉండాలి. అలాగే గది ఉష్ణోగ్రత కూడా బాగుండాలి. ఈ రెండూ లేకపోతే మీరు ఏం చేసినా అస్సలు నిద్రపట్టదు. ఎండాకాలంలో ఫ్యాన్ ను నుంచి వచ్చే శబ్దం, వేడి గాలి నిద్రపట్టకుండా చేస్తాయి. వీటివల్ల కూడా మీకు నిద్ర ఉండదు. 

Image: Getty

అతిగా తినడం

కొంచెం రుచిగా ఉన్నా చాలా మంది రాత్రిపూట మోతాదుకు మించి తినేస్తుంటారు. కానీ హెవీగా తినడం వల్ల మీ కడుపు అసౌకర్యంగా అనిపిస్తుంది.అంతేకాదు మీ జీర్ణక్రియ కూడా సరిగ్గా పనిచేయదు. దీనివల్ల మీకు పుల్లని త్రేన్పులు, చంచలత, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల రాత్రిపూట నిద్రపట్టదు. 

సాయంత్రం వ్యాయామాలు

చాలా మంది ఉదయమే కాకుండా సాయంత్రం కూడా వ్యాయామం చేస్తుంటారు. వ్యాయామం మంచిదే అయినా.. సాయంత్రం పూట వ్యాయామం చేయకపోవడమే మంచిదంటారు నిపుణులు. ఎందుకంటే వ్యాయామం మీ నిద్ర చక్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిజానికి సాయంత్రం వేళ వ్యాయామం చేయడం వల్ల మీ శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇది మిమ్మల్ని మరింత  చురుగ్గా మారుస్తుంది. 
 

sleep

ఏం తింటే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది?

పిస్తా

పిస్తాలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే ఇది మీరు రాత్రిపూట బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. పిస్తాపప్పులో ఎక్కువ మొత్తంలో మెలటోనిన్ ఉంటుంది. మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరం నిద్ర, మేల్కొనే ప్రక్రియను నియంత్రిస్తుంది. మీరు పిస్తాలను రోజూ తింటే రాత్రిపూట బాగా నిద్రపోతారు. 

బ్రెజిల్ నట్స్

నిద్రపోవడానికి బ్రెజిల్ నట్స్ కూడా బాగా సహాయపడతాయి. ఈ గింజలు మీ నిద్రను మెరుగుపరుస్తాయి. బ్రెజిల్ నట్స్ లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇది నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ నట్స్ లో మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

బాదం

బాదం పప్పులను తిన్నా కూడా మీరు రాత్రిపూట కంటినిండా నిద్రపోగలుగుతారు. బాదంలో ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.ఇది మీ నిద్రను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి. కండరాలను సడలిస్తుంది. కొన్ని బాదం పప్పులను రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నిద్రకూడా బాగా పడుతుంది. 

click me!