వీళ్లు వేడి నీళ్లలో నిమ్మరసం పిండుకుని అస్సలు తాగొద్దు.. వీళ్లకు లెమన్ వాటర్ విషం

First Published | Oct 9, 2024, 3:55 PM IST

వేడి నీళ్లలో నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీనివల్ల బరువు ఫాస్ట్ గా తగ్గుతారు. ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో బోలెడు లాభాలు ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం ఈ లెమన్ వాటర్ ను అస్సలు తాగకూడదు. 

బరువు తగ్గాలని చాలా మంది వేడి నీళ్లలో నిమ్మరసం, తేనెను వేసి బాగా కలిపి తాగుతుంటారు. నిజానికి ఈ వాటర్ మీ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు తేనె, నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఎంజైములు మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి.

అలాగే జీవక్రియను పెంచుతాయి. ఇది మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

లెమన్ వాటర్ ను తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీ శరీరం హెల్తీగా ఉంటుంది. కానీ ఈ నీళ్లు ప్రతిఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పలేం.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. అసలు ఈ వాటర్ ను ఎవరెవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

యాసిడ్ రిఫ్లక్స్

యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు కూడా ఇలా లెమన్ వాటర్ ను తాగకూడదంటారు ఆరోగ్య నిపుణులు. యాసిడ్ రిఫ్లక్స్ అంటే కడుపు పదార్థాలు నోటిలోకి తిరిగి వచ్చే పరిస్థితి. దీనికి కారణం కడుపులో ఎసిడిటీ పెరగడమే.

ఈ సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపు ఆమ్లాన్ని పెంచుతుంది.
 


గ్యాస్ట్రిక్ అల్సర్

గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్య ఉన్నవారు కూడా లెమన్ వాటర్ తాగకూడదు. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే కడుపులో పుండ్లు ఏర్పడే పరిస్థితి. అయితే వీళ్లు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే సమస్య మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో ఉండే యాసిడ్ అల్సర్ ను మరింత పెంచుతుంది. అలాగే తేనె కూడా మీ ఒంట్లో వేడిని పెంచుతుంది. దీంతో సమస్య బాగా పెరుగుతుంది. 

కిడ్నీ స్టోన్

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వాటర్ ను తాగితే కిడ్నీ స్టోన్స్ సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ కిడ్నీల్లో కాల్షియం ఆక్సలేట్ ను పెంచుతుంది. 

దంత సమస్యలు

గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే దంతాల సమస్యలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామెల్  బలం తగ్గిస్తుంది. దీంతో మీకు దంత క్షయం, సున్నితత్వం వంటి సమస్యలు వస్తాయి. 

Latest Videos

click me!