మీ మలం లో రక్తం వస్తోందా? అయితే ఇలా చేయండి

First Published | Oct 7, 2024, 11:31 AM IST

ప్రతిరోజూ మలాన్ని గమనించడం అవసరం. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు దీంట్లో రక్తం కూడా వస్తుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచి సంకేతం కాదు. ఈ సమస్య ఉన్నవారు ఏం చేయాలో తెలుసా? 

నిజానికి మలంలో రక్తం రావడం ఆందోళన కలిగించే విషయం. ఇది హేమోరాయిడ్స్ అదే పైల్స్  వంటి చిన్న చిన్న సమస్యల నుంచి పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. సమస్య ఏంటని కన్ఫామ్ చేసుకోవడానికి హాస్పటల్ కు ఖచ్చితంగా వెళ్లాలి. అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా మలంలో రక్తం రావడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 
 

మలంలో రక్తం రాకుండా చేయడానికి, మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం..మలం లోని రక్తం ప్రమాదకరమైంది. అలాగే మీ జీర్ణవ్యవస్థలో ఏదో సమస్య ఉండటాన్ని ఇది సూచిస్తుంది. ఇది చిన్న చిన్న సమస్యల నుంచి ప్రాణాంతక సమస్యలను సూచిస్తుంది. 

మలంలో రక్తం దేనికి సంకేతం

మలంలో రక్తం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఈ రక్తం రంగు, స్థిరత్వం అనేది మీ జీర్ణశయాంతర మార్గంలో రక్తస్రావం మూలాన్ని బట్టి మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మలం లో రక్త రకాలు

ప్రకాశవంతమైన ఎరుపు రంగు రక్తం ఉంటే.. మీకు హేమోరాయిడ్స్, ఆసన పగుళ్లు లేదా తక్కువ జీర్ణశయాంతర రక్తస్రావం  వంటి సమస్యలే కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ముదురు ఎరుపు లేదా మెరూన్ కలర్ రక్తం: ఇది పెద్దప్రేగు లేదా పురీషనాళం దిగువ భాగం నుంచి రక్తస్రావం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నలుపు: నలుపు, జిగటగా ఉండే రక్తం చాలా దుర్వాసన వస్తుంటుంది. ఎగువ జీర్ణశయాంతర రక్తస్రావం, రక్తస్రావం అల్సర్ లేదా అన్నవాహిక సమస్యల వల్ల ఇలాంటి రక్తం వస్తుంది.


మలంలో రక్తం రావడానికి కారణాలు

హేమోరాయిడ్స్:  పాయువు లేదా పురీషనాళంలోని రక్త నాళాలు, ముఖ్యంగా ప్రేగు కదలికల సమయంలో రక్తస్రావం అవుతుంది. 
ఆసన పగుళ్లు: పాయువు పొరలో పగుళ్ల వల్ల కొన్ని చుక్కల రక్తస్రావం అవుతుంది. కానీ ఇది విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. 
జీర్ణశయాంతర రక్తస్రావం: అల్సర్లు, డైవర్టికులోసిస్ లేదా పెద్దప్రేగు క్యాన్సర్ వంటి  సమస్యల వల్ల రక్తస్రావం అవుతుంది. 
తాపజనక సమస్యలు: వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ వంటి వ్యాధుల వల్ల జీర్ణవ్యవస్థలో రక్తస్రావం కలుగుతుంది. 

డాక్టర్ ను ఎప్పుడు కలవాలి?

మీ మలం లో రక్తాన్ని గమనించినట్టైతే.. ముఖ్యంగా తరచుగా అయితే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. అలాగే నొప్పి, పేగుల్లో మార్పులు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మలం నలుపు, తారుగా ఉంటే .. ఇది ఎగువ జిఐ రక్తస్రావం వంటి ప్రమాదకరమైన సమస్యలను సూచిస్తుంది. 

మలంలో రక్తం రావొద్దంటే ఏం చేయాలి? 

మలంలో రక్తం రావడం తగ్గాలంటే ముందుగా మీరు డాక్టర్ ను సంప్రదించి అసలు సమస్య దేనివల్లో తెలుసుకోండి. ఇంటి చిట్కాలు పైల్స్ లేదా ఆసన పగుళ్లు వంటి చిన్న చిన్న సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే వీటితోనే పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలే. చిన్న చిన్న సమస్యలను తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఫైబర్: ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఫైబర్ ఫుడ్ ను పెంచాలి. ఈ ఫైబర్ బలాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే మలవిసర్జన టైంలో ఇబ్బందిని తగ్గిస్తుంది. అలాగే మీరు పండ్లను, కూరగాయలను, తృణధాన్యాలను, చిక్కుళ్లను ఎక్కువగా తినాలి. ఇవి కడుపు ఉబ్బరం లేదా వాయువును బాగా సహాయపడతాయి. 

హైడ్రేటెడ్ గా ఉండండి:  పైల్స్ సమస్య  ఉన్నవారు నీళ్లను పుష్కలంగా తాగాలి. ఇది మలబద్దకం సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలాగే మీ మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మీరు కనీసం రోజుకు 8 గ్లాసుల నీటినైనా తాగాలి. 

వేడి సిట్జ్ బాత్: ఇది కూడా పైల్స్ సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ స్నానం అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అలాగే హేమోరాయిడ్లు లేదా ఆసన పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఇందుకోసం ప్రాభావిత ప్రాంతాన్ని రోజుకు కొన్నిసార్లు గోరువెచ్చని నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టాలి.
 

కలబంద జెల్: కలబంద కూడా పైల్స్ సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది మలవిసర్జన సమయంలో ఉన్న ఇబ్బందిని తగ్గిస్తుంది. ఇందుకోసం తాజా కలబంద జెల్ ను మలద్వారం చుట్టూ అప్లై చేయండి లేదా ఈ కలబంద జ్యూస్ ను తాగండి. 

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను ఉపయోగించి మీరు పైల్స్ చికాకును తగ్గించుకోవచ్చు. ఇందొక లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ప్రభావిత ప్రాంతంలో కొద్దిగా అప్లై చేయండి. అలాగే మీరు ఐస్ ప్యాక్ లను కూడా ఉపయోగించొచ్చు. ఈ ఐస్ ప్యాక్ లు హేమోరాయిడ్స్ వాపు, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

ఇందుకోసం ఐస్ ను ఒక గుడ్డలో చుట్టి ప్రభావిత ప్రాంతంపై రోజుకు చాలాసార్లు 10-15 నిమిషాల పాటు పెట్టండి. ఈ సమస్యలు తొందరగా తగ్గాలంటే మాత్రం మీరు మంచి పరిశుభ్రను ఖచ్చితంగా పాటించాలి. అపరిశుభ్రత మరింత చికాకు పెంచుతుంది. కాబట్టి ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి తేలికపాటి, శుభ్రమైన సబ్బు, నీటిని ఉపయోగించండి. మంచి వాసనొచ్చే టాయిలెట్ పేపర్ ను అస్సలు ఉపయోగించకండి.

Latest Videos

click me!