ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే.. అలసిపోకుండా పనిచేస్తారు

First Published | Oct 8, 2024, 1:49 PM IST

పనులు చేసే వారు మధ్యాహ్నం కల్లా బాగా అలసిపోతుంటారు. ఇది అందరికీ జరిగేదే. కానీ మీరు ఉదయాన్నే కొన్ని రకాల జ్యూస్ లను తాగితే మాత్రం మీకు అలసట అనేదే ఉండదు. ఎనర్జిటిక్ ఉండి పనులన్నింటినీ చకచకా పూర్తి చేస్తారు. 


ఉదయం మీరు ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? అనేది మీ రోజును డిసైడ్ చేస్తుంది. అవును ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే మీరు రోజంతా ఎనర్జిటిగ్ గా ఉంటారు. అలసిపోకుండా పనిచేస్తారు. కొంతమంది రోజు గడిచిపోయే కొద్దీ బాగా అలసిపోవడం, ఒంట్లో శక్తి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ మీరు ఉదయాన్నే కొన్ని రకాల జ్యూస్ లను తాగితే మాత్రం అలసట అనే ముచ్చటే ఉండదు. ఇది మిమ్మల్ని రోజంతా తాగాజా, శక్తివంతంగా ఉంచుతుంది. అంతేకాదు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచే ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లను మనం ఉదయాన్నే తాగొచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. ఇది సూపర్ నేచురల్ డ్రింక్. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మీరు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే మీ శరీరానికి మంచి శక్తి అందుతుంది. అలాగే మీరు కూడా రీఫ్రెష్ గా ఉంటారు. ఈ కొకొనట్ వాటర్ లో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు దీనిలో నేచురల్ షుగర్ కూడా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 


బీట్ రూట్ జ్యూస్

ఉదయాన్నే ఎంచక్కా బీట్ రూట్ జ్యూస్ ను కూడా తాగొచ్చు. ఈ జ్యూస్ లో కూడా నేచురల్ షుగర్ ఉంటుంది. దీన్ని తాగితే మీకు  తక్షణమే శక్తి అందుతుంది. దీన్ని మీరు ఉదయాన్నే తాగితే మీకు శక్తి పుష్కలంగా అందుతుంది. బీట్రూట్ లో విటమిన్ సి, బయోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని హెల్తీగా ఉంచడమే కాకుండా.. చర్మాన్ని కూడా  మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ మీ చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.

ఉసిరికాయ జ్యూస్

మీరు ఉదయాన్నే ఉసిరికాయ జ్యూస్ ను కూడా తాగొచ్చు. ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
 

Pomegranate Juice

దానిమ్మ రసం

దానిమ్మ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ జ్యూస్ ను ఉదయాన్నే తాగితే ఎనర్జీ వస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా చేస్తాయి.  దానిమ్మ రసంలో నేచురల్ షుగర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాగితే మీకు మంచి శక్తి అందుతుంది.

Latest Videos

click me!