పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిలో ఆపిల్ పండు ఒకటి. ఈ పండు మనకు ఎన్నో వ్యాధులను రాకుండా కాపాడుతుంది. అందుకే అంటారు రోజుకో ఆపిల్ తింటే హాస్పటల్ కు దూరంగా ఉంటారని.
Fruits
ఆపిల్ పండ్లలో విటమిన్-సి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఆపిల్ పండ్లు మన ఆరోగ్యానికి దివ్య ఔషదం లాంటివి. ఆపిల్ పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేటివే అయినా.. కొంతమంది వీటిని పొరపాటున కూడా తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
apple
డయాబెటిస్
డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లను తినకూడదు. వీటిలో ఆపిల్ పండ్లు కూడా ఉన్నాయి. అవును ఆపిల్ పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తింటే షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది తెలియక డయాబెటీస్ ఉన్నవారు ఆపిల్ పండ్లను కూడా తింటుంటారు. కానీ షుగర్ ఉన్నవారు ఆపిల్ పండ్లను తినకూడదు.
ఊబకాయం
బరువు తగ్గాలనుకునేవారు కూడా ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ ఆపిల్ పండ్లను తింటే మీరు అస్సలు బరువు తగ్గరు. మరింత బరువు పెరిగిపోతారు. అవును ఆపిల్ పండ్లలో కేలరీలు, షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే మీ బరువు మరింత పెరుగుతుంది.
గుండె జబ్బులు
గుండె జబ్బులతో వ్యాధులతో బాధపడే వారికి ఆపిల్ పండ్లు మంచివి కావు. వీరు ఈ పండ్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీకు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
జీర్ణ సమస్యలు
జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఆపిల్ పండ్లను తినకూడదు. ఎందుకంటే దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని అతిగా తింటే గ్యాస్ సమస్య వస్తుంది. ఇది కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.
అలెర్జీ సమస్యలు
ఒక అధ్యయనం ప్రకారం.. ఆపిల్స్ లో పురుగు మందులుకూడా ఉంటాయి. వీటిలో డిఫెనిలామైన్ అనే రసాయన సమ్మేళనం ఉంది. దీనిని యూరోపియన్ యూనియన్ నిషేధించింది. దీనివల్ల అలెర్జీ సమస్య వస్తుంది.
నోటి ఆరోగ్యం
మీకు తెలుసా? సోడా కంటే ఆపిల్స్ యే ఎక్కువ ఆమ్లంగా ఉంటాయి. అంటే వీటిని తినడం వల్ల నోటి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. రోజుకు రెండు నార్మల్ సైజు యాపిల్స్ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ ఆపిల్స్ తింటే లాభాలకు బదులుగా నష్టాలు కలుగుతాయి.