బలమైన రోగనిరోధక
కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా ఎన్నో సమస్యలు తరచుగా వస్తూనే ఉంటాయి.
అయితే మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె, ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. ఈ రెండింటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో ఐరన్ తో పాటుగా జింక్, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
దగ్గు, జలుబు నుంచి ఉపశమనం
కొంతమందికి సీజన్లతో సంబంధం లేకుండా దగ్గు, జలుబు సమస్యలు వస్తుంటాయి. కానీ ఈ సమస్యలు అంత తొందరగా తగ్గవు. ఇలాంటి వారికి తేనె, ఖర్జూరాలు ఎంతగానో సహాయపడతాయి.
తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే జలుబు, దగ్గు తొందరగా తగ్గిపోతాయిని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను ఖచ్చితంగా తినండి. దగ్గు, జలుబు రావు.