అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

First Published Dec 3, 2021, 5:09 PM IST

అధిక రక్తపోటు (High blood pressure) చాలామందిలో కనిపించే సర్వసాధారణమైన సమస్య. అయితే ఉండాల్సిన దానికన్నా రక్తపోటు కాస్త ఎక్కువగా ఉంటే జీవనశైలిలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదుపులోకి తెచ్చుకోవచ్చు. మరీ ఎక్కువగా ఈ సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంటే డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
 

గుండె నుంచి రక్తనాళాల్లోకి రక్తం ప్రవహించేటప్పుడు ఆ వేగానికి రక్తనాళాల గోడల మీద పడే ఒత్తిడి రక్తపోటు (Blood pressure) లేదా బిపి అంటాం. రక్తపోటును అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి. పూర్తిగా నయం అంటూ ఉండదు. ఒత్తిడి (Stress), ఆందోళన, సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు నియంత్రణ లేకుండా పెరిగిపోతుంటుంది. దీన్ని అశ్రద్ధ చేసే అనేక ప్రాణాంతక సమస్యలు ఎదురవుతాయి. మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు ఉండాలి.

ఎక్కువగా పొటాషియం (Potassium), మెగ్నీషియం (Magnesium), ఫైబర్ (Fiber) ఉన్న పదార్థాలను తీసుకోవాలి. తక్కువ మోతాదులో సోడియం (Sodium) ఉన్న పదార్థాలను తీసుకోవాలి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్ధులు, అధికబరువు ఉన్నవారిలో, కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంది. రక్తపోటును నియంత్రించడానికి సరైన ఆహార పదార్థాలతో పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకుకూరలు: ఆకుకూరలలో (Leafy greens) పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర,  లెట్యూస్, కొల్లార్డ్ గ్రీన్స్, క్యాబేజీ వంటి ఆకుకూరలు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. వీటిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడంతో అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు.
 

వెల్లుల్లి: వెల్లుల్లి (Garlic) సహజసిద్ధమైన యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. రక్తపోటును తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. వెల్లుల్లిని అధిక రక్తపోటును తగ్గించే మంచి ఔషధం (Medicine) అని చెప్పవచ్చు 
 

టమాటా: టమాటాలో (Tomato) యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది కెరోటినాయిడ్లను (Carotenoids) కలిగి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఏదో ఒక రూపంలో మనం నిత్యం తీసుకోవడంతో అధిక రక్తపోటు ను తగ్గించుకోవచ్చు
 

అరటిపండు: అరటిపండులో (Banana) పొటాషియం (Potassium) శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి చక్కగా పనిచేస్తుంది. మంచి రక్తనాళాల్లోకి రక్తం ప్రవహించేటప్పుడు ఆ వేగానికి రక్తనాళాల గోడల మీద పడి ఒత్తిడిని తగ్గిస్తుంది. 
 

కివి: కివిలో (Kiwi) యాంటీబ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. క్రమం తప్పకుండా మనం కివిని తీసుకోవడంతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
 

దానిమ్మ: దానిమ్మలో (Pomegranate) యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. మనం క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ ను తీసుకోవడంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు.

click me!