'రెగ్యులర్'గా చపాతీని తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 02, 2021, 04:50 PM IST

గోధుమ పిండిలో (Wheat flour) తక్కువ క్యాలరీలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇలా చపాతీలో ఉండే అనేక పోషక విలువలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా రెగ్యులర్ గా చపాతీలు తినడంతో  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..   

PREV
110
'రెగ్యులర్'గా చపాతీని తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

అందరిలోనూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక చైతన్యం కలుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధతో (Care) బరువు తగ్గడానికి చపాతీ తినే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే చాలామందికి చపాతీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలియదు. 
 

210

గోధుమ పిండిలో తక్కువ క్యాలరీలు (Calories), ఫైబర్ (Fiber) ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది రెగ్యులర్ డైట్ లో చపాతీని తీసుకుంటారు. ఇది శరీర బరువును తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది.
 

310

ఇందులోని హై న్యూట్రీషియన్ విలువలు (Values) కారణంగా ఊబకాయం,  అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్ క్లోసిస్, ఇతర గర్భధారణ సమస్యను నివారిస్తుంది. చపాతీని (Chapati) తీసుకోవడంతో కలిగి మరి కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..    
 

410

చర్మానికి మేలు చేస్తుంది: గోధుమపిండిలో జింక్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలామేలు చేస్తాయి. చర్మాన్ని హైడ్రేషన్లో (Hydration) ఉంచుతుంది. చర్మానికి తగిన పోషకాలను అందించి చర్మ ఆరోగ్యాన్ని (Skin health) పెంచుతుంది.
 

510

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: గోధుమ పిండి లో ఉండే పోషక విలువలు జీర్ణక్రియను (Digestion) మెరుగుపరుస్తాయి. చపాతీలు తొందరగా జీర్ణమవుతాయి. ఇలా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్దక సమస్యలను (Constipation problems) తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు అన్నంకు బదులుగా రోటీలను తినడం ఉత్తమం.
 

610

న్యూట్రీషియన్ గా పనిచేస్తుంది: గోధుమ పిండి లో విటమిన్ బి, ఇ లతో పాటు కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, అయోడిన్   వంటి ఖనిజాలతో (Minerals) పాటు అనేక పోషకాలు (Nutrients) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి మంచి న్యూట్రీషియన్ గా పనిచేస్తుంది. 
 

710

క్యాన్సర్ ను నివారిస్తుంది: గోధుమ పిండిలో ఉండే ఫైబర్ కంటెంట్ (Fiber content), సెలీనియం కంటెంట్ (Selenium content) కొన్ని రకాల క్యాన్సర్ (Cancer) లను నివారిస్తుంది. క్యాన్సర్ బారీన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

810

శక్తిని అందిస్తాయి: చపాతీలలో కార్బోహైడ్రేట్లు (Carbohydrates) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమయ్యే శక్తిని (Energy) అందిస్తాయి. శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది 
 

910

హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది: గోధుమ పిండిలో ఐరన్ శాతం (Iron percentage) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ (Hemoglobin) శాతాన్ని పెంచుతుంది. రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుంది.
 

1010

బరువును నియంత్రిస్తుంది: చపాతీలో తక్కువ కేలరీలు (Calories) ఉండడంవల్ల శరీర కొవ్వు పెరగకుండా నియంత్రిస్తుంది. దాంతో శరీర బరువు తగ్గించడానికి (Weight loss) సహాయ పడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు వారు రెగ్యులర్ గా డైట్ లో చపాతీలను తీసుకోవడం మంచిది.

click me!

Recommended Stories