తలనొప్పి రావడం సర్వ సాధారణం. ఒత్తిడికి గురైనా, పని ఎక్కువైనా, సరైన ఆహారం తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంది. ఇవే కాదు ఇతర కారణాల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అయితే చాలా మంది ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు.
కానీ తరచుగా ట్యాబ్లెట్లను వాడటం మంచిది కాదు. అయితే కొంతమందికి తలనొప్పి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఇలా మీకు కూడా అయితే మీ శరీరంలో సోడియం లోపం ఉన్నట్టేనంటున్నారు నిపుణులు., అవును.. శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నా తలనొప్పి ఎప్పుడూ వస్తుంటుంది.
ఈ తలనొప్పిని తగ్గించడానికి సోడియం ఎలా సహాయపడుతుంది? దీనిని నయం చేయడానికి శరీరంలో సోడియంను సమతుల్యం చేయడానికి ఏమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సోడియం లోపం తలనొప్పికి కారణమవుతుంది
మన శరీరంలో సోడియం చాలా ముఖ్యమైంది. అయితే దీన్ని మరీ ఎక్కువగా తీసుకున్నా.. తీసుకోవాల్సిన దానికన్నా తక్కువగా తీసుకున్నా ఎన్నో సమస్యలు వస్తాయి. మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటం దీని పని. అయితే మన శరీరంలో సోడియం లోపం ఉంటే శరీర ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది.
ఈ లోపం వల్ల కణాలు అదనపు ద్రవాన్ని గ్రహించడం స్టార్ట్ చేస్తాయి. ఇది కణాలలో వాపునకు కారణమవుతుంది. మెదడు కణాల వాపు వల్ల తలనొప్పి మొదలవుతుంది. అంతేకాదు శరీరంలో సోడియం తగ్గడం వల్ల లో బీపీ సమస్య వస్తుంది. ఇది తలనొప్పి, మైకం వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే సోడియం లోపం వల్ల నాడీ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు.
ఈ డ్రింక్ తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది
తలనొప్పి తగ్గడానికి మీరు క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ బాగా సహాయపడుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. ఇవి శరీరంలో ఉన్న మొత్తం ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఇందుకోసం రెండు క్యారెట్లు, ఒక బీట్ రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. దీన్ని బ్లెండర్ లో వేసి జ్యూస్ చేయండి. వడగట్టి పైన బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తాగితే తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది.
తలనొప్పిని తగ్గించే చిట్కాలు
అల్లం.. అల్లంతో కూడా తలనొప్పిని చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. అల్లం మన తలలోని రక్తనాళాల వాపును తగ్గిస్తుంది. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది. అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది మైగ్రేన్ వల్ల వచ్చే వికార సమస్యను కూడా తగ్గిస్తుంది. మీరు అల్లం టీని తాగితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.
పుదీనా నూనె.. పుదీనా వాసన తలనొప్పిని తగ్గించి మీకు రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది తలనొప్పికి కారణమయ్యే రక్త నాళాలను విస్తరించేలా చేస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ శరీరంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తలనొప్పిగా అనిపించినప్పుడు చీకటి గదిలో కూర్చొని దీనివాసన చూడండి. దీని నూనెను తలకు రాసినా మంచి ఫలితం ఉంటుంది.