ఈ కొరియన్ డైట్ ను ఫాలో అయితే మీ బరువు, పొట్ట ఖచ్చితంగా తగ్గుతాయి

First Published | Sep 10, 2024, 12:43 PM IST

కొరియన్లు ఎంత నాజుగ్గా, సన్నగా ఉంటారో మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అసలు వీళ్లు అలా బరువును ఎలా మెయింటైన్ చేస్తారని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. అయితే వాళ్లు ఫాలో అయ్యే డైట్ ను మీరు కూడా ఫాలో అయితే మీ బరువు, పొట్ట చాలా సులువుగా తగ్గుతాయి.

బరువు తగ్గాలని రకరకాల డైట్ లను ఫాలో అయితుంటారు. కానీ వీటివల్ల బరువు తగ్గిన వారు మాత్రం చాలా తక్కువగా ుంటారు. కానీ కొరియన్ డైట్ మాత్రం మీలో మార్పును ఖచ్చితంగా తీసుకొస్తుంది. అవును కొరియన్లు వారి అందమైన చర్మం, ఫిట్ బాడీకి చాలా ప్రసిద్ది చెందారు. మీకు తెలుసా? కొరియన్ల ఫుడ్ లో తాజా కూరగాయలు, సీఫుడ్, పండ్లు పుష్కలంగా ఉంటాయి.  ఈ రకమైన ఆహారం బరువు తగ్గడానికే కాకుండా.. మీరు అందంగా కనిపించేలా కూడా చేస్తాయి. అదెలాగో ఓ లుక్కేద్దాం పదండి. 

కొరియన్ డైట్ అంటే ఏంటి?

కొరియన్ డైట్ అంటే సాంప్రదాయ కొరియన్ డైట్స్ ఆధారంగా బరువు తగ్గించే ఒక ఫేమస్ పద్ధతి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయలు ఉంటాయి. ముఖ్యంగా సీఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్ మీరు బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా.. మీ జీర్ణ శక్తిని కూడా బలంగా చేస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. మీరు గనుక వీరు తినే ఆహార పదార్థాలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. పొట్ట కూడా తగ్గిపోతుంది.


క్రమం తప్పకుండా వ్యాయామం 

కొరియన్ డైట్ లో మీరు ప్రతిరోజూ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ఇందుకోసం మీరు యోగా, వాకింగ్ లేదా సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలు చేయాలి. ఇవి మీరు ఫాస్ట్ గా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఈ వ్యాయామాలు కేలరీలను బర్న్ చేయడమే కాకుండా మీ శరీరాన్ని ఫిట్ గా, హెల్తీగా ఉంచుతాయి. 

కోరికలను కంట్రోల్ చేయాలి

కొరియన్ వెయిట్ లాస్ డైట్ అంటే సాంప్రదాయ కొరియన్ ఫుడ్ ఆధారంగా సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారాలను తినడమని అర్థం. మీరు ఏవి పడితే అవి తింటే మీ శరీర బరువు బాగా పెరిగిపోతుంది. మీరు బరువు పెరగకూడదంటే మాత్రం ఫుడ్ కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. ఇందుకోసం మీ డైట్ లో స్నాక్స్ ను ఎక్కువగా చేర్చుకోకండి. 
 

కొంచెం కొంచె తినడం

ఎప్పుడైనా సరే కొరియన్లు ఒకేసారి ఎక్కువగా అస్సలు తినరు. వీరు తమ ఆహారంలో భాగ నియంత్రణను ఖచ్చితంగా పాటిస్తారు. మీరు కూడా వారిలా ఉండాలనుకుంటే ఒకేసారి హెవీగా తినకండి. అలాగే పాల ఉత్పత్తులను, చక్కెరను చాలా వరకు తగ్గించాలి. వీటితో పాటుగా పాలు, పెరుగు, చాక్లెట్, స్వీట్లను మీ ఆహారం నుంచి పూర్తిగా తొలగించాలి.
 

belly fat

గోధుమలు, చక్కెర, పాలకు గుడ్ బై 

కొరియన్ల లాగ మీ శరీరం ఫిట్ గా, హెల్తీగా ఉండాలనుకుంటే మీ డైట్ లో కొన్ని మార్పులను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చక్కెర, పాల ఉత్పత్తులు, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను చాలా వరకు తగ్గించాలి. వీటికి బదులుగా మీరు కూరగాయలు, బియ్యం, మాంసం , చేపలను ఎక్కువగా తినాలి. 

Latest Videos

click me!