అధిక కొవ్వు పాల ఉత్పత్తులు
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాలను చాలా మంది తాగుతుంటారు. పెరుగును తింటుంటారు. ఇది సర్వసాధారణ విషయం. కానీ మీకు హై బీపీ సమస్య ఉంటే మాత్రం ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ చీజ్ వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రకమైన పాల ఉత్పత్తుల్లో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
అందుకే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే బీపీ సమస్య కూడా పెరుగుతుంది. మీరు పాల ఉత్పత్తులను తినాలనుకుంటే అధిక కొవ్వు పాల ఉత్పత్తులకు బదులుగా స్కిమ్డ్ మిల్క్ మొదలైన వాటిని తీసుకోండి.