
కాలాలతో సంబంధం లేకుండా టీ, కాఫీలను తాగుతుంటారు. అయితే కొంతమంది టీ తాగితే, మరికొంతమంది కాఫీని తాగుతుంటారు. ఏదేమైనా ఈ రెండూ చలికాలంలో వేడి వేడిగా, బలే టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండింటిని చాలా మంది ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా మన ఇండియాలో టీ, కాఫీలకు మంచి క్రేజ్ ఉంటుంది. చాలా మంది టీ లేదా కాఫీతోనే రోజును ప్రారంభిస్తారు. వీటితోనే డేను ముగిస్తారు.
అయితే చాలా మందికి టీ, కాఫీ రెండింలో ఏది మంచిది అని డౌట్ వస్తుంటుంది. కొంతమంది టీ అంటే, మరికొంతమంది కాదు కాఫీ అని చెప్తుంటారు. టీ తాగేవారు టీ మంచిదని చెప్తే.. కాఫీ తాగేవారు కాఫీ మంచిదని చెప్తుంటారు. కానీ నిపుణులు టీ, కాఫీలో ఏది మంచిదంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీ, కాఫీ ప్రయోజనాలు
టీ, కాఫీ రెండూ మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రెండింటిలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ తాగడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే మానసికంగా చురుగ్గా కూడా ఉంటాం. టీలో ఎల్-థియనిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒత్తిడిని వెంటనే తగ్గించి మనసును ప్రశాంతంగా మార్చేస్తుంది. విశ్రాంతినిస్తుంది.ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
ఒకపోతే కాఫీలో కూడా కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తాగినా మీ శరీరానికి వెంటనే ఎనర్జీ అందుతుంది. అలాగే దీనివల్ల మీరు శారీరక శ్రమను పెంచుతారు. పలు పరిశోధనల ప్రకారం.. కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాఫీ జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది.
టీ, కాఫీలో ఏది మంచిది?
కెఫిన్ సున్నితత్వం: కొంతమందికి టీ, కాఫీలో ఉండే కెఫిన్ కు సున్నితత్వం ఉంటుంది. ఇలాంటి వారు కెఫిన్ ను తక్కువగా తీసుకోవాలి. కాబట్టి వీరికి టీ మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య ప్రభావాలు: టీ లేదా కాఫీలను తాగే అంశాలు ఈ రెండింటిలో ఏది మంచిదో నిర్ణయిస్తాయి. అంటే మీరు మీ ఎనర్జీ లెవెల్స్ ను పెంచుకోవాలనుకుంటే కాఫీ బెస్ట్ ఆప్షన్. కానీ టీ విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
మొత్తం మ్మీద లిమిట్ లో తాగితేనే టీ అయినా కాఫీ అయినా మీకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే మీరు మీ ఆరోగ్యం, మీ టేస్ట్ ను బట్టి టీ, కాఫీలో దేనినైనా తాగొచ్చు. అయినప్పటికీ కెఫిన్ ను తీసుకునే ముందు మీ డాక్టర్ సలహా తీసుకోవడం ఎంతకైనా మంచిది.