బాయిల్డ్ వర్సెస్ ఫిల్టర్డ్ వాటర్.. ఆరోగ్యానికి ఏవి మంచివి?

First Published | Aug 13, 2024, 10:42 AM IST

నీళ్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. ఇవి మన శరీరాన్ని హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అయితే కొంతమంది వాటర్ ను వేడి చేసి తాగితే.. మరికొంతమంది ఫిల్టర్ నీళ్లను తాగుతుంటారు. అయితే ఆరోగ్యానికి ఏ నీళ్లు మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లను పుష్కలంగా తాగాలి. ఆహారం లేకుండా నైనా కొన్నాళ్లు బతకొచ్చు కానీ.. నీళ్లు తాగకుండా.. కొన్ని రోజులు కూడా బతకలేమన్నది నిజం. నీళ్లను తాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందుకోసం నాణ్యమైన నీళ్లను తాగాలి. అయితే నీళ్లను శుద్ధి చేయడానికి కొంతమంది నీళ్లను వేడి చేసి తాగితే.. మరికొంతమంది ఫిల్టర్ నీళ్లను తాగుతుంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

నీళ్లను మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల నీళ్లలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, హానికారక సూక్ష్మజీవులు చనిపోతాయి. నిజానికి ఆరోగ్యాన్ని దెబ్బతీసే బ్యాక్టీరియా నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అయితే నీళ్లను మరిగించడం వల్ల ఇవి సహజంగా తొలగిపోతాయి. ఈ పద్దతి నీటిని సహజంగా, సురక్షితంగా ఉంచుతుంది. ఈ వాటర్ ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. 
 


బాయిల్డ్ వాటర్..

అయితే నీళ్లను మరిగించడం వల్ల దానిలో ఉండే హెవీ మెటల్స్, కెమికల్ పొల్యూషన్, పెస్టిసైడ్స్ వంటి హానికర మూలకాలు పూర్తిగా తొలగిపోవు. కానీ ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా నీళ్లను మరిగించడం వల్ల నీటి టేస్ట్, స్మెల్ రెండూ మారుతాయి. దీంతో నీళ్లను తాగాలనిపించదు. అంతేకాకుండా నీళ్లను మరిగించడానికి కొంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ఇది అన్ని సమయాల్లో సాధ్యం కాదు. 

ఫిల్టర్ వాటర్

ఇకపోతే ప్రస్తుత కాలంలో చాలా మంది ఫిల్టర్ వాటర్ నే తాగుతున్నారు. ఈ వాటర్ బాయిల్డ్ వాటర్ కంటే చాలా మంచిదని నమ్ముతారు. ఎందుకంటే ఈ వాటర్ లో ఉన్న ఉన్న రసాయన కాలుష్య కారకాలు, భారీ లోహాలు, క్లోరిన్, పురుగుమందులు వంటి హానికరమైన మూలకాలను తొలగించడానికి ఫిల్టర్లను ఉపయోగిస్తారు.  ఇది కూడా నీళ్లను సురక్షితంగా ఉంచుతుంది. ఇకపోతే కాచిన వాటర్ కంటే ఫిల్టర్ వాటర్ మంచి టేస్ట్ ఉంటుంది. ఇది తాగడానికి సురక్షితమైందిగా పరిగణించబడుతుంది. 

అలాగే ఈ వాటర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఫిల్టర్ వాటర్ నాణ్యత పూర్తిగా దాని పనితీరుపై ఆధారపడి ఉంటుంది.  మీరు ఉపయోగించే ఫిల్టర్ సరిగ్గా పనిచేస్తున్నట్టైతే ఎలాంటి సమస్యా ఉండదు. 

Latest Videos

click me!