ఇది తెలిస్తే.. వానాకాలంలో ఊరగాయల జోలికే వెళ్లరు

First Published | Aug 11, 2024, 11:54 AM IST

వర్షాకాలంలో వేడివేడిగా, స్పైసీగా తినాలనిపిస్తుంటుంది. అందుకే వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి లేదా ఉసిరికాయ వంటి ఊరగాయలను వేసుకుని తింటుంటారు. కానీ వర్షాకాలంలో ఊరగాయలు తింటే లేనిపోని సమస్యలు వస్తాయి తెలుసా?
 

వర్షాకాలంలో వెదర్ చాలా చల్లగా ఉంటుంది. ఇంకేముంది చల్లని వాతావరణంలో వేడివేడిగా తినాలపినిస్తుంది. కొంతమందికి అయితే స్పైసీగా తినాలనిపిస్తుంటుంది. స్పైసీ టేస్ట్ కోసం చాలా మంది ఇంట్లో ఉనన మామిడి, ఉసిరి, వెల్లుల్లి వంటి ఊరగాయలను ప్రతిరోజూ తింటుంటారు. నిజానికి ఊరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా? అసలు వర్షాకాలంలో ఊరగాయలను ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


రక్తపోటును పెంచుతుంది

అవును ఊరగాయలను ఎక్కువగా తింటే రక్తపోటు పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువగా కలుపుతారు. దీని వల్ల పికిల్స్ లో సోడియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని బాగా పెంచుతుంది. దీంతో గుండె రిస్క్ లో పడుతుంది. 



ఒళ్లు నొప్పులు

వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఊరగాయలను ఎక్కువగా తింటే మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందులోనూ దీనిలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఒంటి నొప్పులు వస్తాయి. 


జీర్ణ సమస్యలు

వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. ముందే ఊరగాయల్లో మిరపపొడి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. అందుకే వర్షాకాలంలో మీకు జీర్ణ సమస్యలు రాకూడదంటే ఊరగాయలను ఎక్కువగా తినడం మానుకోండి.  
 


మూత్రపిండాల సమస్యలు 

పచ్చళ్లలో ఉప్పు శాతం ఎక్కవుగా ఉంటుంది. ఈ సోడియం వల్ల మీ కిడ్నీలపై పనిభారం పెరుగుతుంది. అంటే ఇది మీ మూత్రపిండాలపై ఒత్తిడిని బాగా కలిగిస్తుంది. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 
 

ఎముకల సమస్యలు

ఊరగాయల్లో సోడియం అంటే ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉటుంది. దీనివల్ల మీ శరీరంలో కాల్షియం సరిగ్గా గ్రహించబడదు. దీంతో మీ ఎముకల బలం తగ్గుతుంది. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. 
 

వాపు 

ఊరగాయల్లో  ప్రిజర్వేటివ్స్ ను కూడా వాడుతారు. వీటిని తిన్న మనకు శరీరంలో వాపు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. 

గొంతు సమస్యలు

మీకు తెలుసా? వానాకాలంలో పచ్చళ్లను ఎక్కువగా తింటే కూడా గొంతు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊరగాయలు గొంతు నొప్పికి కూడా దారితీస్తాయి. 
 

Latest Videos

click me!