ఒంట్లో ప్టేట్ లెట్స్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది?

First Published | Aug 3, 2024, 5:18 PM IST

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య  బాగా పడిపోతుంటుంది. కానీ చాలా మంది దీన్ని గుర్తించరు. కానీ మీ శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే?
 

blood platelet count

మారుతున్న జీవనశైలి, వాతావరణం వల్ల మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గడం ఒకటి. ఈ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి తగ్గుతుంది. ఇలాంటి సమయంలో దాని లక్షణాలను గుర్తించడం, టేస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అందుకే మన శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

platelet count


ప్లేట్లెట్ కౌంట్

ఆరోగ్యకరమైన వ్యక్తిలో సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య మైక్రోలీటర్ కు 150 వేల నుంచి 450 వేల మధ్యలో ఉండాలి. 150 వేల కంటే తక్కువ ప్లేట్ లెట్స్ ఉంటే గనుక మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి. 


కండరాల నొప్పి

మన శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడం ప్రారంభించినప్పుడు శరీరంలో నొప్పిగా అనిపించడం మొదలవుతుంది. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం వల్ల కండరాల నొప్పి,  కీళ్ల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఉన్నట్టైతే మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.
 

మైకంగా అనిపించడం

మీకు ఉన్నపాటుగా అకస్మత్తుగా కొన్ని రోజులు ఎక్కువ మైకంగా అనిపిస్తే కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇలా శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటం వల్ల అవుతుంది. ఇలాంటప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. 
 

శరీరంలో బలహీనత

శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తక్కువగా ఉంటే మీకు ఏ పనీ చేయాలనిపించదు. అలాగే చాలా బలహీనంగా కూడా ఉంటుంది. అలాగే శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు చాలాసార్లు  మూత్రం ఎర్రగా వస్తుంది. 
 

విపరీతమైన తలనొప్పి

ఒంట్లో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవడం వల్ల తలలో విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే ఏ పని చేయాలన్నా శరీరానికి శక్తి ఉండదు. చిన్న పనిచేసినా బాగా అలసిపోతుంటారు. మీ శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటే చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా ఏర్పడతాయి. 

Latest Videos

click me!