జామకాయలు కాదు.. జామ ఆకులతో ఎన్ని లాభాలున్నాయో..!

జామకాయలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. కానీ జామ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియవు. అసలు జామ ఆకులు ఏయే అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయంటే?
 

జామకాయ ఒక సీజనల్ పండు.ఈ జామకాయలు ఎక్కువగా శీతాకాలంలో బాగా కాస్తాయి. అయితే మనలో ప్రతి ఒక్కరూ జామ కాయలను మాత్రమే తింటారు. జామ ఆకులు పనికిరావని అనుకుంటారు. కానీ జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. 
 

జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే జీర్ణక్రియను ప్రోత్సహించి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అసలు జామ కాయల వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే? 
 


జామ ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో బయోయాక్టివ్ పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. మీకు తెలుసా? జామ ఆకులు, గుజ్జు, విత్తనాలను సాంప్రదాయకంగా శ్వాసకోశ, జీర్ణశయాంతర వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అలాగే డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.

జామ ఆకులను విరేచనాలతో పాటుగా ఎన్నో జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. జామ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి క్వెర్సెటిన్ ఫ్లేవనాయిడ్ సమ్మేళనం. ఇవి బ్యాక్టీరియాతో పోరాడటమే కాకుండా విరేచనాలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. జామ ఆకు సారాలు జీర్ణశయాంతర సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

జామ ఆకులలో పాలిసాకరైడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలిసాకరైడ్లు డయాబెటిస్ చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, డయాబెటిస్ తో సంబంధం ఉన్న సమస్యలను నివారించడానికి ఇది సహజ నివారణగా పనిచేస్తుంది. 


జామ ఆకులు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే క్యాన్సర్, మధుమేహం,హృదయ సంబంధ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను తిప్పికొట్టే సమ్మేళనాలు కూడా దీనిలో మెండుగా ఉంటాయి. జామ ఆకుల ముఖ్యమైన నూనె యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్,  యాంటీప్రొలిఫెరేటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అంటువ్యాధులతో పోరాడటానికి, క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి సహాయపడుతుంది.
 

Latest Videos

click me!