చాలా తక్కువ క్వాంటిటీలో ఆహారం తీసుకుంటే.. అవసరమైన పోషకాలు ఉండవు, ఇవి సాధారణ శరీర పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. పోషకాహార లోపాలు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి, ముఖ్యంగా గ్రెలిన్ , లెప్టిన్ వంటి ఆకలి , సంతృప్తిని నియంత్రించే హార్మోన్లలో. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఆకలి భావాలను పెంచుతుంది. అతిగా తినడం లేదా కోరికలను కలిగిస్తుంది. బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.