డయాబెటీస్ పేషెంట్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటే మంచిది?

Published : May 07, 2023, 07:15 AM IST

డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడానికి బ్రేక్ ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఫుడ్ ను తింటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. మానసిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.   

PREV
17
డయాబెటీస్ పేషెంట్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటే మంచిది?
diabetes diet

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అందులో మన దేశాన్ని మధుమేహుల రాజధాని అని కూడా అంటారు. ఎందుకంటే మన దేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య అంతలా పెరిగిపోతుంది మరి. ఈ డయాబెటీస్ ను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే డయాబెటిస్ గుండె, మూత్రపిండాలు, కళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధిని సరిగ్గా నియంత్రించకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోయి మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది.

27

అయితే డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి  బ్రేక్ ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంచి అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు మంచి పోషకాలున్న బ్రేక్ ఫాస్ట్ ను తినాలని నిపుణులు చెబుతున్నారు.
 

37
diabetes diet

డయాబెటిస్ అనేది ఒక జీవనశైలి వ్యాధి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ వ్యాధిని నియంత్రించొచ్చు. అల్పాహారం రోజులో అతి ముఖ్యమైన భోజనం. ఎందుకంటే ఇది మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. సాయంత్రం వరకు చురుకుగా ఉండటానికి సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. కానీ అల్పాహారంలో కొన్ని రకాల ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. 

47
diabetes

పండ్లు, పెరుగు ఎక్కువగా ఉండే ఆహారం డయాబెటిస్ ఉన్నవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అల్పాహారంలో పెరుగు లేదా నట్స్ ను చేర్చుకుంటే గ్లైసెమిక్ స్థాయిలు తగ్గి షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. 

57
Diabetes Diet

మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే మీ అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చేర్చండి. డయాబెటిస్ పేషెంట్లు పప్పు, గుడ్లు, సాంబార్, చట్నీ, ఇడ్లీ, పనీర్ ను కూడా అల్పాహారంలో చేర్చుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రోటీన్ బాగా సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం ఎల్లప్పుడూ కండరాల పెరుగుదలతో పాటు చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.
 

67
diabetes diet

మీ అల్పాహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంలో ఒక పండును చేర్చడం మంచిది. కీరదోసకాయ రసం, సెలెరీ జ్యూస్, టొమాటో, పుదీనా జ్యూస్. బచ్చలికూర, నారింజ, క్యారెట్ వంటి ఆహారాలు తినండి.

77

మంచి కొవ్వులు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తప్పకుండా తినండి. బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు, పుచ్చకాయ విత్తనాలు, చియా విత్తనాలు మొదలైన వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. బాదం, చియా విత్తనాలు, ఒకే పండుతో తయారుచేసిన స్మూతీని తినండి. దీంతో మీకు రోజుకు అవసరమైన పోషణ లభిస్తుంది. తులసి విత్తనాలను నీటిలో నానబెట్టి తాగినా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అందుతాయి.

click me!

Recommended Stories