రోజూ వ్యాయామం చేస్తే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

Published : May 06, 2023, 03:45 PM IST

వ్యాయామంతో బోలెడు లాభాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలుసు. అయినా బీజీ షెడ్యూల్స్, దానిపై ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వ్యాయామానికి దూరంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు. మీకు తెలుసా రోజూ వ్యాయామం చేస్తే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు ఎన్ని రోగాలు తగ్గిపోతాయో..!

PREV
19
రోజూ వ్యాయామం చేస్తే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?
Image: Getty

ఒత్తిడి

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడితోనే గడుపుతున్నారు. కానీ ఈ ఒత్తిడి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి గుండెను రిస్క్ లో పడేస్తుంది. సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. ఇంతేకాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే శారీరక శ్రమ ఎండార్ఫిన్‌లు అని పిలువబడే మంచి న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మీ ఒత్తిడి తగ్గిపోతుంది. 

29
high blood pressure

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుంది. రక్తపోటు పెరిగితే ప్రాణాలను గ్యారంటీ ఉండదు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ గుండె బలంగా ఉంటంది. తక్కువ శ్రమతో ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఇది మీ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుంది. అందుకే రోజూ వ్యాయామం చేయండి.
 

39
diabetes

మధుమేహం

ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఒక సారి వచ్చిందంటే మనం చనిపోయేదాకా ఉంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోలేం. కేవలం నియంత్రించాల్సి ఉంటుది. అయితే చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఇన్సులిన్‌కు మరింత సున్నితంగా మారుతుంది. ఇది మీ శరీరంలోని కణాలు శక్తి కోసం రక్తంలో చక్కెరను ఉపయోగించుకునేలా చేస్తుంది. దీనివల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 

49
bad cholesterol

కొలెస్ట్రాల్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఊబకాయం నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే రోజూ వ్యాయామ చేస్తే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది పెరిగితే ఆటోమెటిక్ గా చెడు  కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. 

59
anxiety

ఆందోళన

వ్యాయామం మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఆందోళన లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఆందోళనను తగ్గించడానికి యోగా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

69

బరువు

అధిక బరువు కూడా ఎన్నో రోగాలను దారితీస్తుంది. అందుకే బరువును తగ్గించుకోవాలి. మీరు వ్యాయామం చేస్తే మీ శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీంతో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

79

మొటిమలు

మొటిమలకు ఎన్నో కారణాలున్నాయి. కానీ వ్యాయామం మీ శరీరంలో మోటిమలను  కలిగించే ఎన్నో కారకాలను తగ్గిస్తుంది. ఒత్తిడి, అధిక రక్త చక్కెర, వాపు వంటి వాటిని తగ్గిస్తుంది.
 

89

గుండె జబ్బు

శారీరక శ్రమ మీ గుండెను బలంగా చేస్తుంది. వ్యాయామం మీ శరీరం అంతటా ప్రసరణ కోసం రక్తాన్ని పంప్ చేసే మీ గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

99
cancer

క్యాన్సర్

శారీరక శ్రమ మన రోగనిరోధక వ్యవస్థను బలంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ అభివృద్ధికి దోహదపడే కొన్ని హార్మోన్లను నియంత్రించడానికి వ్యాయామం సహాయపడుతుంది.
 

click me!

Recommended Stories