మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి పరిమాణం పుష్కలంగా ఉండాలి. ఒకవేళ డీహైడ్రేషన్ సమస్య వస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీ పేగుల పనితీరు మరింత దిగజారుతుంది. అంతేకాదు పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.
ఎండాకాలంలో చాలా మంది తరచుగా నిర్జలీకరణానికి గురవుతుంటారు. ఇది ఎన్నో శారీరక సమస్యలకు దారితీస్తుంది. కానీ వీటిలో అత్యంత తీవ్రమైనది ప్రేగులలో సమస్యలు. అవును మీ శరీరంలో నీటి కొరత కారణంగా మీ పేగుల పనితీరు మరింత దిగజారుతుంది. దీంతోపాటుగా పొట్ట, ఇతర సమస్యలు కూడా వస్తాయి. నిర్జలీకరణం వల్ల పేగులలో ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
25
ఎసిడిటీ, గ్యాస్ కు సంబంధించిన సమస్యలు
శరీరం లోపల నీరు లేనప్పుడు, కాల్షియం, మెగ్నీషియం లేకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఇది మీ కడుపు పీహెచ్ ను దెబ్బతీస్తుంది. అలాగే కడుపునకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది.
35
constipation
ప్రేగులలో మలం అంటుకోవడం
పేగుల్లో మలం అంటుకోవడం మీరు తీవ్రమైన నిర్జలీకరణం సమస్యతో బాధపడుతున్నారని అర్థం. నిజానికి నీటి కొరత వల్ల పేగుల పనితీరు క్షీణిస్తుంది. అంతేకాదు ప్రేగు కదలిక కూడా దీని వల్ల ప్రభావితమవుతుంది. దీనివల్ల మీరు మలబద్ధకం బారిన పడొచ్చు. అలాగే కడుపునకు సంబంధించిన సమస్యలు కూడా రావొచ్చు.
45
ఉబ్బరం, వికారం
ఉబ్బరం, వికారం రెండూ మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని సూచిస్తుంది. నిజానికి శరీరంలో నిరంతరం నీటి కొరత ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది అపానవాయువు, ఉబ్బరానికి దారితీస్తుంది. ఇది వికారం కు దారితీస్తుంది కూడా.
55
ఇవి ప్రమాదకరమైన లక్షణాలు కావని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. పేగులతో సంబంధం ఉన్న లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నట్టైతే హాస్పటల్ కు వెళ్లకుండా అలాగే ఉంటే ప్రమాదకరమైన రోగాల బారిన పడతారు. కాబట్టి మీ పేగులను రీహైడ్రేట్ చేయడానికి ముందుగా కొబ్బరి నీళ్లను తాగండి. రెండోది నీళ్లను తాగండి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి.