కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగినా డేంజరే.. ఎందుకంటే?

First Published | Sep 3, 2024, 3:42 PM IST

కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఇవి మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా..  మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. కానీ వీటిని మరీ ఎక్కువగా తాగితే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

కొబ్బరి నీళ్లు  ఒక హెల్తీ డ్రింక్. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు షుగర్ ఉన్న డ్రింక్స్ కు బదులుగా కొబ్బరి నీళ్లను తాగుతున్నారు. కొబ్బరి నీళ్లు సహజంగా హైడ్రేటింగ్ పానీయం. అలాగే ఈ వాటర్ లో పొటాషియం, సోడియం, మెగ్నీషియంతో పాటుగా మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.

ఈ కొకొనట్ వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ వాటర్ ను తాగితే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందనేది వాస్తవం. కానీ ఈ వాటర్ ను అందరికీ మంచిది కాదంటున్నారు నిపుణులు. అసలు ఈ నీళ్లను ఎక్కువగా తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? 

Coconut water

పొటాషియం చేసే అనర్థం

కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పొటాషియాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్తపోటు కూడా బాగా పెరిగిపోతుంది.

అలాగే  మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు లేదా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు గనుక ఉన్నట్టైతే మీరు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగకూడదు. లిమిట్ లో తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు. 


కేలరీలు ఎక్కువగా ఉంటాయి

చాలా మందికి కొబ్బరి నీళ్లు కూడా బరువు పెరగడానికి దారితీస్తాయన్న ముచ్చట తెలియదు. కానీ కొబ్బరి నీళ్లలో కేలరీల కంటెంట్ ఇతర పానీయాల కంటే తక్కువగా ఉంటుంది. కానీ ఇది శక్తి వనరు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. 
 

Coconut water

హార్మోన్ల అసమతుల్యత

కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కొబ్బరి నీటిలో ఉండే ఎక్కువ పొటాషియం ఆల్డోస్టెరాన్ స్రావాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ బీపీని, పొటాషియంను సమతుల్యం చేయడానికి అవసరమైన హార్మోన్ గా పరిగణించబడుతుంది.

దీనితో పాటుగా ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే  పురుషుల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి.

మూత్రపిండాల సమస్యలు

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ముఖ్యంగా ఎవరికైనా పొటాషియం లెవల్స్ ఎక్కువగా ఉంటే కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండటమే మంచిది.
 


జీర్ణ సమస్యలు

కొబ్బరి నీళ్లలో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల కొంతమందికి గ్యాస్, ఉబ్బరం వంటి  జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

మందులతో ప్రతిచర్య

కొబ్బరి నీళ్లు కొన్ని మందులతో ప్రతిస్పందిస్తాయి. వీటిని ఆ మందులతో తాగితే వాటి ప్రభావం మారుతుంది లేదా తగ్గుతుంది. అందుకే మీరు ఏవైన మందులు తీసుకుంటుంటే కొబ్బరి నీరు తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించండి.

Latest Videos

click me!