బరువు తగ్గడానికి లంచ్ టైమ్ ఎంత?
ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం తినే భోజనంలో బరువు తగ్గడానికి సహాయపడే ప్రోటీన్లు మెండుగా ఉంటాయి.
అయితే జెనెటిక్స్ వల్ల బరువు పెరిగిన వారిలో ఈ ప్రోటీన్ తక్కువ స్థాయిలో ఉంటుందని పరిశోధనలో తేలింది. 3 గంటల తర్వాత భోజనం చేసే వారు అస్సలు బరువు తగ్గరు. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారు మధ్యాహ్నం 3 గంటలకల్లా భోజనం చేసేయాలి.
బరువు తగ్గడానికి భోజనం ఎందుకు ముఖ్యం?
మధ్యాహ్న భోజనం చేసే టైం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు. దీనికి అసలు కారణం సిర్కాడియన్ రిథమ్. దీనినే జీవ గడియారం అంటారు. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టైతే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువ కేలరీలున్న ఫుడ్ ను తినొచ్చు.