కోపం ఎంత పనిచేస్తుందో తెలుసా?

First Published May 25, 2024, 4:07 PM IST

కోపం రానివారు ఎవరూ ఉండరేమో. కొంతమందికి ఎప్పుడూ కోపమొస్తే.. మరికొంతమందికి మాత్రం ఎప్పుడో ఒక్కసారి వస్తుంటుంది. ఏదేమైనా కోపం రావడం సహజమే. కానీ ఈ కోపం మీ కొంప ముంచుతుంది. అవును కోపం వల్ల మీ ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందో తెలిస్తే షాక్ అవుతారు. 
 

మనుషులన్నాక నవ్వడం, ఏడవడం, కోపగించుకోవడం, సంతోషంగా ఉండటం వంటివి చాలా కామన్. సందర్భాన్ని బట్టి మన హావ భావాలు మారిపోతుంటాయి. కోపం ఈ భావోద్వేగాలలో ఒకటి. అవతలి వారు విసుగు నచ్చని పని చేసినప్పుడే కాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా కోపం వస్తుంది. కోపం రావడం చాలా కామన్. కోపం రానివారు ఎవరూ ఉండరు. కానీ ఈ కోపం మీ ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదు. అవును కోపం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తరచుగా కోపం వచ్చేవారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు చాలానే ఉన్నాయి. అసలు కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గుండెకు హానికరం..

కోపం శరీరం ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. కానీ ఇది మీ గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కోపం గుండెలో మార్పులకు కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కోపం రక్తాన్ని పంప్ చేసే కండరాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందట. అలాగే అధిక రక్తపోటుకు కారణమవుతుంది. అలాగే గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా గుండె జబ్బులకు కారణమవుతుంది. 
 

Latest Videos


గుండెపోటు ప్రమాదం 

కోపం ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో.. కోపం పెరగడం వల్ల గుండెపోటు ప్రమాదం మరింత పెరిగిందని కనుగొన్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..  భరించలేని కోపం  మీ గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. 

మానసిక ఆరోగ్యం 

కోపంగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం బాగా ప్రభావితం అవుతుంది. యాంగ్జైటీ, నిరాశ వంటి భావోద్వేగ రుగ్మతలలో కోపం బాగా పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మరింత అధ్వానంగా మారుస్తుంది. 

Anger

నిద్రకు భంగం 

కోపాన్ని నియంత్రించడానికి కష్టపడే వారు లేదా తరచుగా కోపంగా ఉండేవారికి సరిగ్గా నిద్రపట్టదట. ఒక అధ్యయనం కోపం, నిద్ర భంగం మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. సింపుల్ గా చెప్పాలంటే కోపం వచ్చేవారికి హాయిగా నిద్రపోవడంలో ఇబ్బంది ఉంటుంది.

click me!