రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? ఏమౌతుందో తెలుసా?

First Published Sep 12, 2024, 4:06 PM IST

 మొబైల్ ఫోన్లను అవసరానికి వాడితే ఎలాంటి సమస్యలు రావు. కానీ అతిగా వాడితేనే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తే ఎన్ని వ్యాదులొస్తాయో తెలుసా? 

మొబైల్ అడిక్షన్

మన జీవితంలో ఫోన్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. కానీ మొబైల్ వాడకం మానసిక, శారీరక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఫోన్ తో ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. కానీ చాలా మంది ఫోన్లను అవసరానికి మించే ఉపయోగిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనలో చాలా మంది ఫోన్లకు బానిసలయ్యారు. 

నిజానికి మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. మీరు గనుక ఫోన్ వాడకాన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో ఎంతో భాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Latest Videos


మొబైల్ ఫోన్ నుంచి వచ్చే  రేడియేషన్ మీ ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తుంది. మీకు తెలుసా? ఈ రేడియేషన్ వల్ల ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మూర్ఛ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. 

పిల్లలు మొబైల్ వాడకం

మీకు తెలుసా? ఇండియాలో ప్రతి 1000 మందిలో 6 మందికి మూర్ఛ వ్యాధి ఉందని నిపునులు చెబుతున్నారు.  ముఖ్యంగా.. పిల్లలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మూర్ఛ ప్రమాదం పెరుగుతుంది" అని అంటున్నారు.

పిల్లలకు మొబైల్ అడిక్షన్

మొబైల్ ఫోన్  స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు.  నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య  రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. చికిత్స తీసుకుని నయమైన తర్వాత కూడా మూర్ఛ సమస్య ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. 

మొబైల్ అడిక్షన్

ఈ మూర్ఛ వ్యాధి నయం కావడానికి మీరు  కనీసం 3 సంవత్సరాలైనా రెగ్యులర్ గా మందులను వాడాల్సి  ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మూర్ఛ వ్యాధికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. సాధారణంగా 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

click me!