టమాటాలను ఎక్కువగా తిన్నారో..!

Published : Jul 02, 2023, 01:50 PM IST

టమాటాలను ఎక్కువగా తింటే కీళ్లలో వాపు, నొప్పి వస్తాయి. ఇందుకు కారణం టమాటాల్లో ఉండే సోలనిన్ అనే ఆల్కలాయిడ్. ఇది కణజాలాల్లో కాల్షియం పెరుగుదలకు కారణమవుతుంది.   

PREV
16
 టమాటాలను ఎక్కువగా తిన్నారో..!

టమాటాలు లేని కూరలు ఉండనే ఉండవు. నిజానికి టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ప్రస్తుతం టమాటా ధరలు కొండెక్కాయి. కేజీ వంద రూపాయలు పలుకుతోంది. ఈ సంగతి పక్కన పెడితే సాధారణంగా మనం సూప్ లు, సలాడ్స్ లో టమోటాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ప్రతిరోజూ టమాటాలను వంటల్లో వేసి తింటాం. టమాటాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటిని అతిగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే? 
 

26
tomatoes

గుండెల్లో మంట

టమోటాల్లో సిట్రిక్, మాలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగులను ఆమ్లంగా చేస్తాయి. అందుకే టమోటాలను ఎక్కువగా తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఇది యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. 

36

కిడ్నీల్లో రాళ్లు

కిడ్నీ పేషెంట్లు టమాటాలను తినకూడదని చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే టమాటాల్లో పొటాషియం  ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి మంచిది కాదు. టమాటాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. టమోటాలు ఆక్సలేట్ కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. 

46
Tomatoes

అలెర్జీ, చర్మంపై దద్దుర్లు

టమోటాలలో హిస్టామిన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టమాటాలను అతిగా తింటే చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలాగే అలర్జీలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
 

56
tomatoes

కీళ్లలో వాపు

టమాటాలు ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో కీళ్ళలో వాపు, నొప్పి కూడా ఉంది. అవును టమాటాల్లో ఉండే సోలనిన్ అనే ఆల్కలాయిడే కీళ్లలో నొప్పిని కలిగిస్తుంది. ఈ సమ్మేళనం కణజాలాలలో కాల్షియం పెరుగుదలకు కారణమవుతుంది.
 

66

లైకోపెనోడెర్మియా

లైకోపెనోడెర్మియా అనేది రక్తంలో ఎక్కువ మొత్తంలో లైకోపీన్ ఉండటం. దీనివల్ల చర్మం రంగు పాలిపోతుంది. సాధారణంగా లైకోపీన్ శరీరానికి మంచిది. కానీ రోజుకు 75 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ లైకోపీన్ ను తీసుకుంటే లైకోపెనోడెర్మియా వస్తుంది. 

click me!

Recommended Stories