పురాతన కాలం నుంచి వెండిని రాజరికానికి చిహ్నంగా భావిస్తారు. ఆ రోజుల్లో అయితే రాజులు, ధనవంతులు మాత్రమే వెండి పళ్లెంలో తినేవారట. అది వారి రాయల్టీ అని మీరు అనుకోవచ్చు. కానీ వెండి పళ్లెంలో ఎవ్వరూ తిన్నా ఎన్నో ఆరోగ్యా ప్రయోజనాలను పొందుతారనేది నిజం. అవును.. ఇది ఏదో అలా చెప్తున్న మాట కాదు.. శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఈ విషయం నిజమని రుజువైంది. అందుకే వెండి ప్లేట్ లో తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వెంటనే తెలుసుకుందాం పదండి.
వెండి ప్లేట్ లో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
సిల్వర్ లో సహజ యాంటీ వైరట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సిల్వర్ ప్లేట్ లో తినే వారికి ఎలాంటి వైరల్, అంటువ్యాధులు సోకవు. అలాగే ఈ ప్లేట్ లో తింటే మీ ఆయుష్షు పెరుగుతుంది.
మీరు గమనించారో లేదో.. చిన్న పిల్లలకు అన్నప్రాసన రోజు వెండి ప్లేట్ లో తినిపిస్తారు. నిజానికి చిన్న పిల్లలకు వెండి పల్లెంలో తినిపించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది పిల్లల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఇది మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే వెండి చెంచాతో తింటే కూడా మనం ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉంటామని నిపుణులు చబెతుున్నారు.
మీకు తెలుసా? వెండి పాత్రల్లోని ఆహార పదార్థాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లేట్ ఆహారంలోని సూక్ష్మక్రిములను చంపేస్తుంది. ముఖ్యంగా సిల్వర్ ప్లేట్ లో ఆహారాన్ని తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు రానేరావు. అలాగే సిల్వర్ ప్లేట్ లో ఫుడ్ ను తినడం వల్ల డయేరియా, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు రావు.
వెండి పళ్లెంలో ఫుడ్ ను తింటే మన శరీరంలోని కణాలు పునరుత్తేజపడతాయి. ఇది దెబ్బతిన్న కణాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వెండిలో మన శరీరానికి అయిన గాయాలను త్వరగా మాన్పే గుణం ఉంటుంది.
వెండి విషపూరితం కానే కాదు. ఇదొక సురక్షితమైన లోహం. ఇది అంత సులువుగా తుప్పు పట్టదు. ముఖ్యంగా వెండి మన శరీరానికి హాని కలిగించే విష పదార్థాలను ఉత్పత్తి చేయదు. అలాగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అందుకే ఇది గాలిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నుంచి ఆహారాన్ని కాపాడుతుంది.