జస్ట్ 2 వెల్లుల్లి రెబ్బలను బీపీ ఉన్నవారు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jul 17, 2024, 4:25 PM IST

అధిక రక్తపోటు చాలా డేంజర్. ఎందుకంటే ఇది మన ప్రాణాలను రిస్క్ లో పెట్టేస్తుంది. అందుకే బీపీ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే వెల్లుల్లి రెబ్బలను రోజూ రెండు తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరి వీటిని ఎలా తినాలంటే?
 

మారుతున్న జీవన శైలి వల్ల నేడు చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో అధిక రక్తపోటు లేదా బీపీ ఒకటి. ఈ హై బీపీ వల్ల తలనొప్పి, మైకము, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి వల్ల గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

బీపీ పేషెంట్లు వెల్లుల్లి తింటే? 

అధిక రక్తపోటుతో బాధపడేవారికి వెల్లుల్లి రెబ్బలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును వెల్లుల్లిని తింటే బీపీ సమస్య తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, అల్లిసిన్, విటమిన్ బి-12 రక్తపోటును నియంత్రిస్తాయి. 


garlic

బీపీ ఉన్నవారికి వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు 

వెల్లుల్లిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, జింక్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అందుకే బీపీ ఉన్నవారు వెల్లుల్లి రెబ్బలను తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. 
 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

రోజూ వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బలంగా అవుతుంది. దీనివల్ల మీకు దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది. 

ఒత్తిడి వల్ల కూడా అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీకు వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.
ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 
 

షుగర్ నియంత్రణ

వెల్లుల్లి షుగర్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి డయాబెటిస్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

Garlic

వెల్లుల్లిని ఎలా తినాలి 

మీకు అధిక రక్తపోటు సమస్య ఉన్నట్టైతే  పచ్చి వెల్లుల్లి తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉదయాన్నే పరగడుపున 2 వెల్లుల్లి మొగ్గలను నీటితో కలిపి తినండి.
 

Latest Videos

click me!