రోజూ ఒక తమలపాకు నమిలితే ఏమౌతుంది?

Published : Jan 28, 2025, 03:03 PM IST

తమలపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. వీటిని గనుక రోజూ ఒకటి తింటే ఏమౌతుందో తెలుసా?

PREV
15
రోజూ ఒక తమలపాకు నమిలితే ఏమౌతుంది?
betel leaf

తమలపాకు అందరికీ తెలుసు. వీటిని హిందూ మతంలో ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తారు. అలాగే వీటిని తింటారు కూడా. ఎక్కువగా నానమ్మలు, అమ్మమ్మలే వీటిని ఎక్కువగా తింటుంటారు. నిజానికి వీటిని ఎవ్వరైనా తినొచ్చు. ఎందుకంటే వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. అసలు రోజూ ఒక తమలపాకు నమిలితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

తమలపాకును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

తమలపాకు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుందన్న సంగతి చాలా మందికి తెలియదు. తమలపాకును తింటే జీవక్రియ బాగా పెరుగుతుంది. అలాగే కడుపు కూడా ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. వీటివల్ల మీరు తొందరగా బరువు తగ్గుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. 

35

మలబద్ధకం సమస్య 

ఈ రోజుల్లో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. నీళ్లను సరిగ్గా తాగకపోవడం, తప్పుగా తినడమేనంటున్నారు నిపుణులు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు రోజూ ఒక తమలపాకును నమలడం ప్రయోజరకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక తమలపాకును తినడం వల్ల శరీరంలోని అన్ని టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే మలబద్ధకం నుంచి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. తమలపాకు మలబద్దకం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

45


జలుబు, దగ్గు నుంచి ఉపశమనం 

చలికాలంలో దగ్గు, జలుబు వంటి సీజనల్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో ఉండే యాంటీ బయోటిక్ లక్షనాలు సీజనల్ వ్యాధులను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.

తలనొప్పికి తమలపాకు ప్రయోజనాలు 

తలనొప్పిని తగ్గించడంలో కూడా తమలపాకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక తమలపాకును నమలండి. తొందరగా తగ్గిపోతుంది. తమలపాకులోని ఔషద, శీతలీకరణ లక్షణాలు తలనొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 
 

55

గాయాలను నయం చేయడానికి

తమలపాకులను గాయాలు నయం కావడానికి కూడా ఉపయోగించొచ్చు. ఈ ఆకులను చికిత్స సమయంలో బ్యాండేజీల రూపంలో కూడా ఉపయోగిస్తారు. దీనిని వాడటం వల్ల గాయాలు తొందరగా నయమవుతాయి. తమలపాకుతో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

click me!

Recommended Stories