అల్పాహారం కోసం వెజ్ పోహా లేదా ఓట్స్ పోహా తినండి. ఇది కాకుండా, మీరు చియా పుడ్డింగ్ / చీజ్ శాండ్‌విచ్ లేదా 2 గుడ్ల ఆమ్లెట్ కూడా తినవచ్చు.
వీటన్నింటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి . అల్పాహారంగా తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. మీ జీర్ణశక్తి బాగుంటే, మీరు అల్పాహారంలో కూడా మొలకలు తినవచ్చు. కానీ, మీ జీర్ణశక్తి బలహీనంగా ఉంటే మాత్రం తినకండి. ఏదైనా కాలానుగుణ పండ్లను మధ్యాహ్న సమయంలో తినండి. దీనితో పాటు, మీరు గుమ్మడికాయ , పొద్దుతిరుగుడు విత్తనాలను తినాలి.పండ్లలో ఫైబర్ , అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంతో పాటు శరీరానికి బలాన్ని అందిస్తుంది.