గుడ్లనే కాదు పాలను కూడా సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను తాగాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పాలు పోషకాలకు మంచి వనరు. ఈ పాలు మన శరీరానికి అవసరమైన పోషణను అందించడానికి సహాయపడతాయి. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ ఎ, ఫాస్పరస్, విటమిన్-డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పాలను తాగితే.. ఇంకొంత మంది మాత్రం నైట్ పడుకునే ముందు తాగుతారు. పాలతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీటిని ఎంతైనా తాగొచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే.. అన్నింటిలాగే పాలు కూడా మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి. అసలు పాలను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..