బీపీ తగ్గితే ఏమవుతుందో తెలుసా?

First Published Jan 26, 2024, 1:16 PM IST

రక్తపోటు మరీ ఎక్కువగా ఉండకూడదు. మరీ తక్కువగానూ ఉండకూడదు అన్న మాటను వినే ఉంటారు. మరి బీపీ తక్కువగా ఉంటే ఏమౌతుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం పదండి. 
 

blood pressure

రక్తపోటు పెరగడం, తగ్గడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా రక్తపోటు పెరిగితే  ప్రాణాలకే ప్రమాదం అన్న సంగతి చాలా మందికి తెలుసు. అందుకే రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు దాన్ని ఎప్పుడూ నియంత్రిస్తూనే ఉండాలి. బీపీ పెరిగితేనే కాదు తగ్గితే కూడా సమస్యే. అవును రక్తపోటు తగ్గడం వల్ల కూడా లేనిపోని రోగాలు వస్తాయి. 
 

blood pressure

రక్తపోటు పెరిగితే మన గుండెపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. రక్తపోటు పెరిగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. బీపీ పెరిగితే డేంజర్ అన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ మనలో చాలా మందికి బీపీ తగ్గితే ఏమౌతుందో? ఎలాంటి సమస్యలొస్తాయో తెలియదు. 

Latest Videos


బీపీ ఎప్పుడు తగ్గుతుంది? బీపీ తగ్గిందని ఎలా తెలుస్తుంది?

మన రక్తపోటు 90/60 ఎంఎంహెచ్ జీ కంటే తక్కువగా ఉన్నప్పుడు బీపీ తగ్గిందని అర్థం చేసుకోవాలి. రక్తపోటు సాధారణం కంటే తగ్గినప్పుడు మన శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. కానీ మీకు మీరే బీపీ తగ్గిందని డిసైడ్ చేసుకోకుండా.. హాస్పటల్ కు వెళ్లి  టెస్టులు చేయించుకొని మాత్రమే నిర్దారించుకోవాలి.
 

బీపీ తగ్గినప్పుడు.. మైకము, కంటిచూపు మసకబారడం, స్పృహ కోల్పోవడం, వికారం, వాంతులు, మగత, విషయాలను అర్థం చేసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే అప్పుడప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలో డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి. 
 

blood pressure

బీపీ  తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో.. డిప్రెషన్, దీర్ఘకాలిక విశ్రాంతి, అలెర్జీలు, గుండె జబ్బులు,  పార్కిన్సన్ వ్యాధి, ఎండోక్రైన్ వ్యాధులు, డీహైడ్రేషన్, రక్తహీనత, అంటువ్యాధులు, పోషక లోపాలతో సహా కొన్ని రకాల మందులు ఉన్నాయి. అయితే కారణాన్ని బట్టి బీపీ తగ్గుదల కనిపిస్తుంది. 
 

బీపీ పెరిగితేనే కాదు తగ్గితే కూడా మీరు దీన్ని సమస్యగా భావించాలి. హాస్పటల్ కు వెళ్లాలి. బీపీ తగ్గడం వల్ల గుండెపై ఎక్కువ పనిభారం పడుతుంది. అందుకే బీపీ పడిపోవడం గుండెకు ప్రమాదం ఉందనడానికి ఇదే సంకేతం. లేదంటే బీపీ తగ్గి గుండెకు ముప్పు వస్తుంది. 

లో బీపీ కూడా గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది. బీపీ తగ్గడం వల్ల స్ట్రోక్, ఫాల్స్, లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, డిమెన్షియా వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. తేలిగ్గా తీసుకోవాల్సిన సమస్య కాదు ఇది. అందుకే బీపీ తక్కువగా ఉన్నవారు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ నార్మల్ అయ్యేలా చూసుకోవాలి. 

click me!