ఎలాంటి వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం.. ఇంత ఈజీనా..?

First Published Apr 10, 2021, 10:42 AM IST

తీరా రియలైజ్ అయ్యే సమయానికి ఉండాల్సినదానికన్నా ఎక్కువ కొవ్వు కూడా శరీరంలో పెరుకుపోతోంది. దీంతో.. ఆ పెరిగిన బరువు తగ్గించేందుకు జిమ్ ల వెంట పరిగెడతారు. 

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఊరికే బరువు పెరిగిపోతున్నారు. పలు రకాల రుచులకు అలవాటు పడిపోయి.. జంక్ ఫుడ్స్ తిని.. అవసరం లేని బరువు పెరిగిపోతున్నారు.
undefined
తీరా రియలైజ్ అయ్యే సమయానికి ఉండాల్సినదానికన్నా ఎక్కువ కొవ్వు కూడా శరీరంలో పెరుకుపోతోంది. దీంతో.. ఆ పెరిగిన బరువు తగ్గించేందుకు జిమ్ ల వెంట పరిగెడతారు. లేదంటే కడుపు మాడ్చుకొని డైటింగ్ చేస్తారు. అయితే.. అసలు ఎలాంటి వ్యాయామం చేయకున్నా కూడా బరువు సులభంగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
undefined
బాగా లావు కావడానికి అధికంగా తినడం ఒక కారణం. ఒక్కోసారి మన పొట్ట ఫుల్ గా ఉన్నా సరే.. ఫుడ్ చూస్తే తినకుండా ఉండలేం. అలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్న వాళ్లం అవుతున్నాం.
undefined
మీరు నిజంగా బరువు తగ్గాలి అనుకుంటే.. ముందు అలా ఎక్కువ తినడం కంట్రోల్ చేసుకోవాలి. ఐడియల్ బరువు చేరుకోవడానికి ఎంత తినాలి అనే అవగాహన తెచ్చుకోవాలి. అందుకు తగిన ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.
undefined
కొందరికి ఆకలిగా లేకపోయినా... ఫుడ్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి., ఏదో ఒకటి తినాలి అనే కోరికగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ మంది జంక్ ఫుడ్ కి ఎట్రాక్ట్ అవుతారు. దాని వల్ల త్వరగా బరువు పెరిగిపోతారు. అలా కాకుండా.. అలా తినాలి అనే కోరిక కలిగినప్పుడు మంచినీరు తాగాలి లేదంటూ.. డ్రైఫ్రూట్స్, బెర్రీస్ తినాలి.
undefined
అనారోగ్యానికి దారితీసే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి బదులు... ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారానికి చోటు కల్పించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది.
undefined
ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది.. మంచినీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గే విషయంలో వండర్స్ చూస్తారు. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ సేపు పొట్ట ఫుల్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
undefined
శరీరానికి సరిపోయే ప్రోటీన్ ఫుడ్ మాత్రం అందేలా చూసుకోవాలి. క్యాలరీలు తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ ఉండటం చాలా ముఖ్యం.
undefined
ఇక సరిపోను నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిగాలేకపోయినా కూడా విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
undefined
ఈ టిప్స్ ఫాలో అయితే... సులభంగా బరువు తగ్గొచ్చు.
undefined
click me!