Health Tips: ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా? ఇలా తగ్గించండి

First Published | Jan 3, 2024, 7:15 AM IST

Health Tips: ఉదయం లేవగానే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలి. కానీ కొన్ని సార్లు ఉదయం లేవగానే తలనొప్పి వస్తుంటుంది. ఇది ఆ రోజును మొత్తం నాశనం చేస్తుంది. అందుకే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ ఉదయపు తలనొప్పిని తగ్గించుకోవాలి. 

ఉదయం లేవగానే ఫ్రెష్ గా, ఫుల్ ఎనర్జీతో ఉండాలని కోరుకుంటాం. కానీ అలా జరగకపోతే రోజంతా నాశనం అవుతుంది. మానసిక్ స్థితి బాగా లేకపోతే రోజంతా పనిచేయడం చాలా కష్టం. అలాగే చిరాగ్గా కూడా అనిపిస్తుంది. చలికాలంలో చాలా మందికి ఉదయాన్నే తలనొప్పి వస్తుంది. సాధారణంగా చలికాలంలో ఉదయం తలనొప్పి రావడం సర్వసాధారణం. తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లని గాలుల వల్ల ఇలా జరగొచ్చు. అలాగే ఇతర కారణాలు ఉండొచ్చు. చాలాసార్లు ఈ తలనొప్పి  కొన్ని గంటల పాటు ఉంటుంది. అందుకే ఈ సమస్యను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నీళ్లు తాగాలి

సాధారణంగా తలనొప్పి రావడానికి శరీరంలో నీరు లేకపోవడమే ప్రధాన కారణం. చాలా కాలంలో చాలా మంది నీళ్లను తక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో చెమట తక్కువగా పడుతుంది. దీంతో మీకు ఎక్కువ దాహంగా అనిపించదు. కానీ నీళ్లను తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురై తలనొప్పి వస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. రోజంతా కనీసం 8 గ్లాసుల నీటిని తాగండి. ఇది శరీరంలో నీటి కొరతను కలిగించదు. 

Latest Videos


stress

ఒత్తిడిని నిర్వహించండి

మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి లేదా ఏదైనా వ్యక్తిగత కారణం వల్ల ఒత్తిడికి గురి కావొచ్చు. ఇవి కూడా తలనొప్పికి కారణమవుతాయి. అందుకే ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి. ఇది నిరాశ, ఆందోళన వంటి సమస్యలను నివారించడానికి కూడా మీకు సహాయపడుతుంది.

హ్యూమిడిఫైయర్ 

చలికాలంలో జలుబుతో పాటుగా సైనస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అయితే జలుబు కారణంగా ముక్కు మూసుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు తలనొప్పి కూడా వస్తుంది. అందుకే మీ గదిలో హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి. ఇది గాలిలో తేమను నిలుపుకుంటుంది. అలాగే మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.
 

చల్లిన గాలులకు దూరంగా 

చల్లని గాలులు చెవుల్లోకి వెళ్లకుండా రాత్రిపూట మందపాటి దుప్పట్లను ఉపయోగించండి. అంతేకాదు కావాలంటే టోపీ పెట్టుకుని కూడా నిద్రపోవచ్చు. ఇలా చేయడం వల్ల చలి ఎక్కువగా పెట్టదు. అలాగే ఉదయం లేచిన తర్వాత తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
 

నిర్ణీత సమయానికి నిద్రపోవాలి

మీ అంతర్గత గడియారాన్ని సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఇది సరిగ్గా లేకుంటే కూడా తలనొప్పి సమస్య వస్తుంది. అందుకే నిద్రపోవడానికి, లేవడానికి నిర్ణీత సమయాన్ని కేటాయించండి. ఇది మీ అంతర్గత గడియారం మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. అలాగే తలనొప్పి సమస్యను కూడా తగ్గిస్తుంది.

click me!