న్యూ ఇయర్ లో యోగా మొదలెడుతున్నారా? వేయాల్సిన ఆసనాలు ఇవే..!

First Published | Jan 1, 2024, 1:02 PM IST

మీరు ఈ నూతన సంవత్సరంలో యోగా చేయాలని అనుకుంటే,  ఈ ఆసనాలతో యోగాను ప్రారంభించండి. ఎలాంటి ఆసనాలతో యోగాను ప్రారంభించాలో ఓసారి చూద్దాం..


మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ఈ న్యూ ఇయర్ లో అయినా ఆ పనులు చేద్దాం.. ఈ పనులు చేద్దాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాటిలో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం ఒకటి. దానిలో భాగంగా ఎక్కువ మంది ఈ ఏడాది యోగాని తమ జీవితంలో భాగం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా..? మీరు ఈ నూతన సంవత్సరంలో యోగా చేయాలని అనుకుంటే,  ఈ ఆసనాలతో యోగాను ప్రారంభించండి. ఎలాంటి ఆసనాలతో యోగాను ప్రారంభించాలో ఓసారి చూద్దాం..

tadasana

1.తాడాసన..
యోగాను కొత్తగా మొదలుపెట్టినవారు ఈ తాడాసనతో ప్రారంభించడం ఉత్తమం. మునివేళ్లపై నిలపడి కాళ్లు పైకి ఎత్తాలి. అలా కాళ్లను ఎత్తి ఉంచి.. చుట్టూ తిరగాలి. ఈ యోగాసనం చేయడం వల్ల ఎత్తు పెరుగుతారనే నమ్మకం కూడా ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల శరీర భంగిమ, రక్త ప్రసరణ సజావుగా ఉంటుంది. హృదయ స్పందన రేటు మెరుగుపరుస్తుంది.

Latest Videos


2.అధోముఖ శవాసన..
యోగా ఆసనాలు మొదలుపెట్టాలి అనుకునేవారు ఈ అధోముఖ శవాసన చేయడం మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడానికి సహాయపడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి సహాయపతాయి. చాల రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది.

virabhadrasana

3.వీరభద్రాసన..
కచ్చితంగా ప్రయత్నించాల్సిన మరో యోగాసనం వీరభద్రాసన. ముందుగా ఒక కాలు పదాన్ని వెనక్కి పెట్టాలి.త ర్వాత ముందు ఉన్న కాలిని మోకాలి వద్ద వంచాలి. ఈ ఆసనం మన పాదాలు బలపడటానికి సహాయపడుతుంది.

4.వృక్షాసన..
ఈ ఆసనాన్ని చిన్న పిల్లలు సైతం ప్రయత్నించవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల వ్యక్తి ఏకాగ్రత బాగా పెరుగుతుంది. శరీరాన్ని చాలా సులువగా బ్యాలెన్స్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

child pose yoga

5.చైల్డ్ పోజ్..
ఇది వేయడం చాలా సులువు. కానీ, దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఈ ఆసనం కూడా మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది వెన్నుముకను పొడిగిస్తుంది. సాగదీస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతుతుంది.

click me!