పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, బీటా కెరోటిన్, పొటాషియం, లైకోపీన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పుచ్చకాయ ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ డైట్ ప్లాన్ గురించి మీరు వినే ఉంటారు. ఈ డైట్ ప్లాన్ బరువును తగ్గించడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ ను కూడా తొలగిస్తుందని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలు ఎండాకాలంలోనే పండుతాయి. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. త్వరగా బరువు తగ్గడానికి పుచ్చకాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
26
పుచ్చకాయ శరీరంలోని విషాన్ని బయటకు పంపుతుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, విటమిన్ బి 1, విటమిన్ బి 6, లైకోపీన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
36
పుచ్చకాయ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండు. దీనిలో కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇది మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. అంటే ఇది శరీరం నుంచి అదనపు నీటిని, విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుందన్న మాట. పుచ్చకాయ వేగంగా బరువు తగ్గడానికి, కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
46
పుచ్చకాయ తక్కువ కేలరీలున్న పండు. అంటే దీన్ని తింటే మీరు కేలరీలను ఎక్కువగా తీసుకోలేరు. ఇది మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే వాటర్ కంటెంట్ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. వేడి వాతావరణంలో లేదా వ్యాయామం చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం.
56
పుచ్చకాయ విటమిన్ ఎ, విటమిన్ సి కి మంచి మూలం. అలాగే దీనిలో పొటాషియం కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా చేస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
66
అయితే పుచ్చకాయ పోషకాహారానికి పూర్తి వనరు కాదు. దీనిలో మీ శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందించదు. పుచ్చకాయ డైట్ ను ఎక్కువ కాలం ఫాలో అయితే పోషకాల లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లకు ఈ పండు అస్సలు మంచిది కాదు.