Weight loss: బరువు తగ్గించే త్రిఫల... ఎలా తీసుకోవాలో తెలుసా.!

Published : Dec 14, 2021, 01:52 PM IST

ఇది ఆరోగ్యకరమైన, కావాల్సిన శరీర బరువుకు ప్రత్యక్ష మార్గం. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వర్కవుట్ విధానంతో పాటుగా త్రిఫలాన్ని తీసుకుంటే ఉబకాయం సమస్య తగ్గడంతోపాటు.. సులభంగా బరువు తగ్గడానికి సహాయపడతుంది.

PREV
17
Weight loss: బరువు తగ్గించే త్రిఫల... ఎలా తీసుకోవాలో తెలుసా.!

త్రిఫల చూర్ణం అని ఆయుర్వేదంలో పేరు వినే ఉంటారు. మూడు పండ్లను కలిపి తయారు చేసే హెర్బల్ ని త్రిఫల చూర్ణం అంటారు.ఆరోగ్యకరమైన ఆహారం ,వ్యాయామ నియమాలతో పాటు రోజూ తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

27

మన శరీరం పనితీరు, రూపాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలలో జీర్ణక్రియ ఒకటి. త్రిఫల జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది .జీర్ణవ్యవస్థ  సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది కాబట్టి, ఇది ఆరోగ్యకరమైన శరీరానికి,మన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

37

త్రిఫల పెద్దప్రేగు కణజాలాన్ని బలపరుస్తుంది . టోన్ చేస్తుంది . బొడ్డు చుట్టూ చేరే అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది .జీవక్రియను పెంచుతుంది, ఇది ఆరోగ్యకరమైన, కావాల్సిన శరీర బరువుకు ప్రత్యక్ష మార్గం. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వర్కవుట్ విధానంతో పాటుగా త్రిఫలాన్ని తీసుకుంటే ఉబకాయం సమస్య తగ్గడంతోపాటు.. సులభంగా బరువు తగ్గడానికి సహాయపడతుంది.

47

ఈ త్రిఫల చూర్ణం.. పౌడర్ రూపంలో, లిక్విడ్ రూపంలో, టాబ్లెట్ లేదా క్యాప్సూల్స్‌లో అందుబాటులో ఉంటుంది, త్రిఫల సమీపంలోని ఆయుర్వేద స్టోర్ లేదా ఆన్‌లైన్ సైట్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. మీరు కొనుగోలు చేస్తున్న ఉత్పత్తి సరైనదో కాదో మాత్రం తేల్చుకోవాల్సిన పని మీ చేతిలోనే ఉంది. 

57

ఈ త్రిఫల చూర్ణం అద్భుతంగా పనిచేసేందుకు భుజనానికి ముందు ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఒక రోజులో 500mg నుండి 1gm లు మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే.. తొందగా ఎక్కువ బరువు తగ్గుతామని మాత్రం అనుకోవద్దు.  దీనిని గోరువెచ్చని నీటిలో లేదా. తేనెలో కలిపి తీసుకోవచ్చు. ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకొని.. దీనిని తీసుకోవడం ఉత్తమం. 
 

67

 మీరు గర్భవతిగా ఉన్నట్లయితే లేదా పాలిచ్చే పక్షంలో, త్రిఫల తినకపోవడమే మంచిది, ఎందుకంటే ఇది రక్త ప్రసరణ పెరుగుదలకు దారితీయవచ్చు,,గర్భస్రావాలకు కారణమవుతుంది.

77

మీరు డయాబెటిక్ అయితే వైద్యుల సలహా తీసుకోకుండా దీనిని తీసుకోవద్దు.

· మీరు ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే త్రిఫల పెద్ద మోతాదులను తీసుకోకండి ఎందుకంటే ఇది మీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

· పిల్లలకు త్రిఫల మోతాదులను ఇవ్వకండి, ప్రత్యేకించి అధిక మోతాదులో లూజ్ మోషన్స్ లేదా డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. కాబట్టి.. దీనిని తీసుకోవడంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. 

click me!

Recommended Stories