తాజా సీజనల్ ఫ్రూట్స్
సీజనల్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయల నుంచి మామిడి, బెర్రీల వరకు సీజనల్ ఫ్రూట్స్ ఎండాకాలంలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు వీటిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. తగ్గిన ఆకలిని పెంచడానికి ఈ పండ్లు సహాయపడతాయి. పుచ్చకాయలు, ఖర్బూజాలు, పైనాపిల్స్, పీచెస్ వంటి హైడ్రేటింగ్ పండ్లను రోజూ తినండి. వీటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. అలాగే మీ శరీరంలోని నీటి స్థాయి తగ్గకుండా చూస్తుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.