పోషక పదార్ధాలు
జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ప్రకారం.. చింత పండులో ఫినోలిక్, యురోనిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, టార్టారిక్ ఆమ్లం, పెక్టిన్ లు ఉంటాయి. ఈ గుజ్జులో మ్యూసిలేజ్, గ్లైకోసైడ్లు, అరబినోజ్, జిలోజ్, గ్లూకోజ్, గెలాక్టోస్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. వీటితో పాటు క్యాల్షియం, కాపర్, ఐరన్, కాడ్మియం, మాంగనీస్, ఆర్సెనిక్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ వంటి ముఖ్యమైన మూలకాలు కూడా ఉంటాయి. చింతపండు గుజ్జులో టార్టారిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, సుక్సినిక్ ఆమ్లం అలాగే ఫార్మిక్ ఆమ్లం, అమైనో ఆమ్లాలతో సహా కొన్ని ముఖ్యమైన సేంద్రీయ ఆమ్లాలు ఉంటాయి.