సులువుగా బరువు తగ్గాలా..? యాపిల్ టీ తాగండి..!

First Published Jun 14, 2021, 2:02 PM IST

ఈ యాపిల్ టీ ని కావాలంటే వేడిగా తాగొచ్చు.. చల్లగా కూడా తాగొచ్చు. ఇది బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. 

మీరు ఎన్నో రకాల టీ ల గురించి విని ఉంటారు.. మరెన్నో రకాల టీ లు రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా యాపిల్ టీ రుచి చూశారా..? యాపిల్ పండు తిన్నాం కానీ.. ఈ యాపిల్ టీ ఏంటా అనుకుంటున్నారా..?
undefined
ఈ యాపిల్ టీ ని కావాలంటే వేడిగా తాగొచ్చు.. చల్లగా కూడా తాగొచ్చు. ఇది బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. మరి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం..
undefined
యాపిల్ పండు ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని కొందరు పండులా తినడానికి ఇష్టపడితే.. కొందరు సలాడ్స్ లో ఇంకొందరు జ్యూస్ లేదా కేక్స్ వంటి వాటిల్లో కలిపి తీసుకోవాలని అనుకుంటారు.
undefined
దీనిలో పోషకాలు చాలా ఎక్కువ. యాపిల్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బరువును అదుపులో ఉంచడానికి కూడా సహాయం చేస్తుంది.
undefined
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. యాపిల్ తో ఇంట్లోనే యాపిల్ ని టీని తయారు చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలని అనుకునేవారికి ఇది బెస్ట్ పానియం అని చెప్పొచ్చు.
undefined
ఆపిల్ ముక్కలు నీటిలో ఉడికించి.. అందులో టీపొడి వేయాలి. ఆ తర్వాత అందులో చిన్న దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. చాలాసేపు మరగపెట్టిన తర్వాత.. దీనిని వడపోసి టీ తాగొచ్చు.
undefined
వేడి వేడిగా అయినా తాగొచ్చు లేదంటే.. చల్లారిన తర్వాత కూడా దీనిని తాగొచ్చు. దీనిని రోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
undefined
ఈ యాపిల్ టీలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు... రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
undefined
యాపిల్ గుజ్జు, దాని తొక్కులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సాంద్రత ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలిస్ట్రాల్ ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. దానిన వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
undefined
click me!